Bigg Boss 8 : ‘బిగ్ బాస్ 8’ లో పాల్గొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్న చివరి 16 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే!

- Advertisement -

Bigg Boss 8 : బుల్లితెర ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సరికొత్త సీజన్ మరో మూడు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించి రెండు ప్రోమోలు విడుదల అయ్యాయి. ఈ రెండు ప్రోమోలలో ఈ సీజన్ కాన్సెప్ట్ ఏమిటో అందరికి అర్థం అయిపోయింది. ఇక కంటెస్టెంట్స్ విషయం లో ఎంతోమంది పేర్లను ప్రతీ రోజు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు చివరిగా అగ్రిమెంట్ చేసుకున్న 16 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ మీ ముందు ఉంచబోతున్నాము. ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా ట్రెండింగ్ లో ఉన్న జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్ఫీ ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నాడు.

Bigg Boss Telugu Season 8: Contestants List With Photos | Bigg Boss Telugu Season 8: Complete Contestants List Revealed | Bigg Boss Telugu 2024: Contestants Photos and Details | Bigg Boss Telugu

ఈమధ్య ఈయన రాజకీయంగా చేసిన పలు వ్యాఖ్యలు సెన్సేషన్ సృష్టించాయి. అలాగే ప్రముఖ ఇంస్టాగ్రామ్ సెలబ్రిటీ యువ సామ్రాట్ కూడా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నాడు. ఈయన రీసెంట్ గా హర్ష సాయి తో గొడవపడుతూ డిబేట్స్ లో కూర్చున్న సందర్భాలను ఎన్నో మనం చూసాము. అలాగే సీరియల్స్ లో విలన్ రోల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యి, ఇంస్టాగ్రామ్ లో కూడా విపరీతమైన యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రీతూ చౌదరీ కూడా ఈ షో లో పాల్గొనబోతుంది. ప్రస్తుతం ఆమె స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. ఇదే షో లో ఉన్నటువంటి ప్రేరణ కంభం కూడా కంటెస్టెంట్ గా ఖరారు అయ్యింది. ఈమె స్టార్ మా ఛానల్ లో టాప్ టీఆర్ఫీ రేటింగ్స్ ని సాధించిన ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈమె టాస్కులు కూడా అద్భుతంగా ఆడుతుంది, అలాగే కన్నడ లో ప్రసారమైన బిగ్ బాస్ మినీ షో లో కూడా ఈమె కంటెస్టెంట్ గా పాల్గొనింది. జబర్దస్త్ నుండి యాదమరాజు, సీరియల్ నటి అంజలి పవన్, హారిక వంటి వారు కూడా ఈ షో లో పాల్గొనేందుకు అగ్రిమెంట్ మీద సంతకాలు చేసారు.

- Advertisement -

Bigg Boss Telugu Season 8 gets a launch date

అలాగే జబర్దస్త్ నుండి నరేష్, పవిత్ర, సినీ హీరో ఆదిత్య ఓం లు ఖరారు అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇంస్టాగ్రామ్ లో టాప్ మోడల్ గా చలామణి అవుతున్న కుషిత కళ్లపు కి సోషల్ మీడియా లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె కూడా ఈ షో లో పాల్గొనబోతుంది. మరో సంచలనాత్మక విషయం ఏమిటంటే రాజకీయ విశ్లేషణలతో సంచలనం రేపి, ప్రస్తుతం టీడీపీ పార్టీ లో కొనసాగుతున్న రాజేష్ మహాసేన కూడా ఈ షో లో కంటెస్టెంట్ గా ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. ఇక గత సీజన్ లో రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ సతీమణి తేజస్విని గౌడా ఈ షో లో పాల్గొనబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా సీజన్ 7 లో లాగానే ఈ సీజన్ లో 2.0 గ్రాండ్ లాంచ్ ఉండబోతుందని తెలుస్తుంది.

Bigg Boss Telugu Season 8 Promo Drops: Nagarjuna And Satya Tease Unlimited Entertainment, Fun, And Twists! - Filmibeat

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here