Bigg Boss 8 బిగ్ బాస్ 8 లోకి కంటెస్టెంట్ గా కౌశల్..? రోజుకో ట్విస్ట్ ఇస్తున్న బిగ్ బాస్ టీం!

- Advertisement -

Bigg Boss 8  : ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ బిగ్ బాస్ సీజన్స్ కంటే త్వరలో ప్రారంభం అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో కొత్త రకంగా ఉండబోతోంది అనేది మనకి ప్రోమోలను చూస్తేనే అర్థమైపోతుంది. ఈ సీజన్ థీమ్ ‘ఇన్ఫినిటీ’ అనే కాన్సెప్ట్ మీద నడవబోతుంది. గత సీజన్ లో ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ ని ఉపయోగించి, పెద్ద బ్లాక్ బస్టర్ ని అందుకున్న బిగ్ బాస్ టీం, ఈసారి ఈ థీమ్ తో మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ఇది వరకే మనం చాలా విన్నాము. అది కాసేపు పక్కన పెడితే సీజన్ 7 లో ఉన్నట్టుగానే ఈ సీజన్ లో కూడా మినీ లాంచ్ ఉండబోతోంది. గత సీజన్ లో మినీ లాంచ్ ఎపిసోడ్ ద్వారా అర్జున్, భోలే, నయనీ పావనీ, పూజ మూర్తి బిగ్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 వ అవసరం లో అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో కూడా మినీ లాంచ్ ద్వారా పాత సీజన్స్ కి సంబంధించిన 5 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 5 వ వారంలో అడుగుపెట్టబోతున్నారు.

Bigg Boss 8
Bigg Boss 8

వారిలో కౌశల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ గా నిల్చిన ఈయన, ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ లో టాప్ కంటెస్టెంట్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీజన్ ద్వారా ఆయనకీ వచ్చినంత ఫాలోయింగ్ కూడా ఏ కంటెస్టెంట్ కి రాలేదు. పరిస్థితులకు తగ్గట్టు అమర్ దీప్ లాగా రెచ్చిపోకుండా చాలా తెలివిగా గేమ్ ఆడి విన్నర్ గా నిలిచాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Bigg Boss Telugu 2: Will BB team fall prey for Kaushal's game plan?

- Advertisement -

ఆయనతో పాటుగా గత సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి మొదటి వారంలోనే వెళ్లిపోయిన నయనీ పావని, బిగ్ బాస్ సీజన్ 6 నుండి శ్రీ సత్య పాత కంటెస్టెంట్స్ క్యాటగిరీ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే ఈ సీజన్ సెప్టెంబర్ 1 వ తేదీన మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈపాటికి ప్రారంభ తేదీ అధికారికంగా వచ్చేయాలి కానీ, ఇప్పటి వరకు రాకపోవడం పై ప్రేక్షకులు ఈ సీజన్ వారం రోజులు వాయిదా పడే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నారు.

Bigg Boss Telugu 8: Telugu TV's Reality Show To Have Two Different Houses & Unique Rules; Launch In August? - Filmibeat

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here