Bigg Boss 8 : బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ కి నరకం కానుందా..? కాన్సెప్ట్ కి భయపడి ముగ్గురు కంటెస్టెంట్స్ అవుట్!

- Advertisement -

Bigg Boss 8 : స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వయస్సు తో సంబంధం లేకుండా ఈ షో కి లక్షలాది మంది అభిమానులు. ఆ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ప్రతీ సీజన్ వారిని ఆకట్టుకునేందుకు ఎదో ఒక కొత్త ఆలోచనలతో మన ముందుకు వస్తుంటారు బిగ్ బాస్ టీం. ఆ ఆలోచనలు కేవలం సీజన్ 6 లో తప్ప మిగతా అన్నీ సీజన్స్ లో వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా గత ఏడాది ప్రసారమైన సీజన్ 7 అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇప్పుడు సీజన్ 8 మరో మూడు వారాల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ దాదాపుగా 70 శాతం ఖరారు అయ్యారు.

Bigg Boss 8
Bigg Boss 8

మిగిలిన కంటెస్టెంట్స్ మరో వారం రోజుల్లో ఖరారు కాబోతున్నారు. అయితే ఈ సీజన్ కి సంబంధించిన మెయిన్ ప్రోమో నిన్న విడుదల చేసారు. ఈ ప్రోమో మొదటి ప్రోమో కి కొనసాగింపుగా కనిపించింది. ఈ ప్రోమో చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థం అయ్యింది ఏమిటంటే ఈ సీజన్ లో టాక్స్, ఎంటర్టైన్మెంట్, ఫన్, ఎమోషన్స్ , గొడవలు ఇలా అన్నీ అన్ లిమిటెడ్ గా ఉండబోతున్నాయి, వాటికి అంతం అనేదే లేదు అని. చూసేందుకు ఇది చాలా బాగుంటుంది కానీ, కంటెస్టెంట్స్ కి ఇది పెద్ద అగ్ని పరీక్షే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా కఠినమైన టాస్కు ఆడాల్సినప్పుడు అన్ లిమిటెడ్ అంటే నరక ప్రాయంగానే ఉంటుంది. అలాగే ఈ హౌస్ లో ఏదైనా పెద్ద సవాలు లాగానే ఉంటుందట.

Bigg Boss Telugu 8 Leaks: Even Before The New Season Starts, Here Is An Interesting Update On The Wildcard Entries!

- Advertisement -

ఉదాహారానికి సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు అంత తేలికగా మానలేరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వారు సిగరెట్ తాగాలంటే ఇంతకు ముందు సీజన్స్ లో చూపించినట్టు స్మోకింగ్ రూమ్ కి వెళ్లి సులువుగా తాగడం వంటివి ఉండదు. అందుకు టాస్కు ఆడాలి, ఒకవేళ టాస్కు ఆడి సిగరెట్ తాగేందుకు అనుమతి వస్తే, బిగ్ బాస్ ఆపమని చెప్పేంత వరకు తాగుతూనే ఉండాలట. ఇలా హౌస్ లో ప్రతీ సౌకర్యానికి డిఫరెంట్ టాస్కులు చెయ్యాల్సి ఉంటుంది. ఈమధ్యనే కొంతమంది కంటెస్టెంట్స్ కి ఇంటర్వూస్ పూర్తి అయ్యి, అగ్రిమెంట్ మీద సంతకం చేసే ముందు ఈ సీజన్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చెప్పారట, వాళ్ళు భయపడి మా వల్ల కాదు అంటూ ముగ్గురు కంటెస్టెంట్స్ వెనకడుగు వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu Season 8 Promo Drops: Nagarjuna And Satya Tease Unlimited Entertainment, Fun, And Twists! - Filmibeat

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here