BiggBoss 8 : బిగ్ బాస్.. బుల్లి తెర పై బిగ్గెస్ట్ రియాల్టీ షో. ఏ భాషలో తీసినా కళ్లు చెదిరే టీఆర్పీతో దూసుకుపోతుంది. ఆ షో స్టార్ట్ అయిందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కునిపోయేంతలా ఆకట్టుకుంది. ఇక తెలుగులో కూడా అతిపెద్ద రియాలిటీ షోగా మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ న్యూస్ ఆ షో అభిమానులకు ఓ రేంజ్ లో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అందరికీ తెలుసు బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ లేడీస్ ఎంత ఇష్టపడుతుంటారో.. ఆ గొడవలు.. అల్లర్లు.. గిల్లికజ్జాలు చాలా చాలా బాగుంటాయి. మరీ ముఖ్యంగా కావాలనే గొడవ పెట్టుకునే తీరు భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే బిగ్ బాస్ ఇప్పటికే మొత్తంగా 7 సీజన్ లు కంప్లీట్ చేసుకున్నాయి. త్వరలోనే ఎనిమిదవ సీజన్ స్టార్ట్ కాబోతుందట.

అయితే ఈ సీజన్ కి మళ్లీ మన్మథుడు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడన్న వార్త అభిమానులకు నిరాశ కలిగిస్తుంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన అన్ని సీజన్లకు నాగార్జున నే హోస్టింగ్ చేశారు. హోస్ట్ మారాలి అంటూ ఎంతమంది అభిమానులు డిమాండ్ చేస్తున్నా బిగ్ బాస్ మేనేజ్మెంట్ మాత్రం పట్టించుకోవడం లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 8కి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి హోస్ట్ చేయబోతున్నాడంటూ ప్రచారం జరిగింది.
సీన్ కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 8 కి కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నాడు అంటూ ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం. అంతేకాదు ఈ సీజన్ మరింత రసవత్తరంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. స్టార్ కపుల్స్ ని కూడా జంటగా బిగ్ బాస్ హౌసులోకి పంపించబోతున్నారట . అంతేనా ఈసారి టిఆర్పి పెంచే విధంగా కొత్త కొత్త టాస్కులు కూడా పెట్టబోతున్నారట. అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం జూన్ మొదటి వారంలో బిగ్ బాస్ షో సీజన్ 8 స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కంటెస్టెంట్లు ఎవరనేది ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.