Bigg Boss Priyanka : కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక..అసలు ఏమైందంటే!

- Advertisement -

Bigg Boss Priyanka : పుట్టింది అబ్బాయిగానే..కానీ అమ్మాయి లక్షణాలు ఉండడం తో ఆపరేషన్ చేయించుకొని అమ్మాయి లాగ మారిపోయిన నటి ప్రియాంక సింగ్. ఈమె అప్పట్లో జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యింది. ఎన్నో లేడీ స్కిట్స్ చేసింది. ఆ తర్వాత ఎన్నో ఈవెంట్స్ లో పాల్గొంటూ, అలా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం రావడం తో, ఆ షో ద్వారా ఆమె కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.

చూడగానే ఎవరు ఈ అమ్మాయి, ఇంత అందంగా కనిపిస్తుంది అని అనిపిస్తాది. కానీ ఆమె అమ్మాయిగా మారడానికి ఎన్ని కష్టాలు పడిందో రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకుంటూ బాధ పడింది. చిన్న తనం లో తన అక్క బట్టలు వేసుకొని తిరిగేదానిని, అప్పటి నుండే నేను అమ్మాయిగా మారిపోవాలని ఫిక్స్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ చిన్నతనం లో ఉన్నప్పుడు ఊర్లో ప్రతీ ఒక్కరు తన గురించి చాలా రకాలుగా మాట్లాడుకునేవారు. నాన్న కూడా ఒకరోజు వాళ్ళ లాగానే మాట్లాడడం తో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాను. కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నాను. 60 శాతం చర్మం కాలిపోయింది. దానికి చికిత్స తీసుకోవడం తో నార్మల్ అయ్యాను.

- Advertisement -

తర్వాత ప్రేమలో విఫలం అయ్యినప్పుడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోబోయాను, అతికష్టం మీద మళ్ళీ కోలుకున్నాను. సర్జరీ అయ్యాక ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మరోసారి నిద్ర మాత్రలు మింగాను, మళ్ళీ నా అదృష్టం బాగుండి బ్రతికాను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అలా జీవితం లో ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకొని ఈ స్థాయి కి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమెకి పెళ్లి సంబంధాలు కూడా బాగానే వస్తున్నాయట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here