Bigg Boss Priyanka : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల విషయం లో మగవాళ్ళతో సమానంగా ఆడుతూ లేడీ టైగర్ అనిపించుకున్న కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రియాంక జైన్. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లోకి వచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. ‘మౌనరాగం’ మరియు ‘జానకి కలగనలేదు’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక జైన్, ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మరింత దగ్గర అయ్యింది.

టీవీ ఆడియన్స్ ని పక్కన పెడితే, ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందే సోషల్ మీడియా ఆడియన్స్ కి కూడా తన యూట్యూబ్ ఛానల్ తో బాగా దగ్గరైంది. తనకి జీవితం లో జరిగే ప్రతీ సంఘటన కి సంబంధించిన వీడియోలను ఆ ఛానల్ లో ఆమె అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

అయితే రీసెంట్ గా ఆమె కంటికి సంబంధించిన ఒక కీలకమైన సర్జరీ చేయించుకుంది. ఈ సర్జరీ ప్రారంభం నుండి పూర్తి అయ్యే వరకు వీడియో తీసి, ఆమె కాబొయ్యే భర్త శివ్ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసారు. ఈ వీడియో ని చూసిన ప్రియాంక అభిమానులు అయ్యో మా పరి కి ఎంత కష్టం వచ్చిందో అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొంత మాత్రం ప్రియాంక చేయించుకున్న కంటి సర్జరీ ప్రతీ పది మందిలో ఆరుగురు చేయించుకుంటారు.

ఈ మాత్రానికి అంత డ్రామా, అంత నాటకం అవసరమా, సీరియల్ యాక్టింగ్ లు వీళ్ళు బయట కూడా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రియాంక ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ చెయ్యబోతుందో తెలియదు కానీ, అతి త్వరలోనే స్టార్ మా ఛానల్ లో సంక్రాంతి స్పెషల్ గా టెలికాస్ట్ అవ్వబోయే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే ఎపిసోడ్ లో పాల్గొనబోతుంది. హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆమె మొట్టమొదటి సారి అమర్ దీప్ మరియు శోభా శెట్టి తో కలిసి స్కిట్ వెయ్యబోతుంది.
