Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అమర్ మరియు ప్రశాంత్ మధ్య జరిగిన గొడవలు ఏ సీజన్ లో కూడా జరగలేదు అనే చెప్పాలి. రెండవ వారం నుండే వీళ్లిద్దరి మధ్య గొడవ ప్రారంభం అయ్యింది,ఆ తర్వాత అనేక సార్లు నామినేషన్స్ అప్పుడు గొడవలు జరిగాయి. అమర్ అదుపు తప్పి ప్రశాంత్ ని ‘ఆ నా కొడుకు’ అని కూడా అనేసింది సందర్భం ఉంది.

అయితే పదవ వారం నుండి ఇద్దరూ మంచి స్నేహితులుగా కలిసిపోయారు. కానీ 12 వారం లో అమర్ ఎప్పుడైతే ప్రశాంత్ ని నామినేట్ చేసాడో అప్పటి నుండి మళ్ళీ వీళ్లిద్దరి మధ్య గొడవ తార స్థాయికి చేరిపోయింది. ఈ వారం నామినేషన్స్ లో ఇద్దరూ ఎలా రెచ్చిపోయారో మనమంతా చూసాము. అయితే మళ్ళీ వీళ్లిద్దరు కలిసిపోయారు, మంచిగా ఉన్నారు, పట్టుమని ఇక పది రోజులు కూడా లేవు ఈ సీజన్ ముగియడానికి, ఇక మంచిగానే ఉంటారులే అని అందరూ అనుకున్నారు.

కానీ ఈరోజు జరిగిన టాస్కు లో మళ్ళీ వీళ్లిద్దరి మధ్య తారా స్థాయిలో గొడవలు జరిగాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. పల్లవి ప్రశాంత్ అమర్ మెడ పెట్టుకున్నాడని, అమర్ ప్రశాంత్ ని చాలా గట్టిగా కొరికేసాడని అంటున్నారు. ఇద్దరు ఫిజికల్ అయ్యారు కాబట్టి నాగార్జున ఇద్దరికీ రెడ్ కార్డు ఇచ్చి ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్లిద్దరి మధ్య ఈరోజు జరిగిన గొడవ బిగ్ బిన్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవరి మధ్య జరగలేదని అంటున్నారు. ఇది కాస్త అమర్ ఫ్యాన్స్ కి ప్రశాంత్ ఫ్యాన్స్ కి బాధని కలిగించే విషయమే. సీజన్ చివరికి వచ్చినప్పుడు స్వీట్ మెమోరీస్ ని సృష్టించుకుంటారు అని అనుకుంటే, ఇద్దరూ చేదు జ్ఞాపకాలను క్రియేట్ చేసుకుంటున్నారని అభిమానులు వాపోతున్నారు. మరి ఈ ఎపిసోడ్ లో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది చూడాలి.
