Pallavi Prashanth : ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ బిగ్ బాస్ షో రచ్చలకు గొడవలకు కేంద్ర బిందువుగా మారింది. హౌస్ లో జరిగిన గొడవలకు బయట ఆడియన్స్ నుండి ఈ స్థాయి రియాక్షన్ రావడం అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా గెల్చిన పల్లవి ప్రశాంత్ ని నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ ఫినాలే రోజు రాత్రి వేల సంఖ్యలో అభిమానులు గుమ్మిగూడారు. ఆ సమయం లో పోలీసులు అందించిన ప్రోటోకాల్ ని కంటెస్టెంట్స్ అందరూ అనుసరించారు కానీ, పల్లవి ప్రశాంత్ మాత్రం అనుసరించలేదు. పైగా పోలీసులపై దౌర్జన్యం చేసి ,రూల్స్ కి విరుద్ధంగా ర్యాలీ ని చెయ్యడం వల్ల ఆగ్రహించిన పోలీసులు ప్రశాంత్ పై నాన్ బైలబుల్ కేసులను పెట్టారు.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-628-1024x614.png)
దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీ లో పల్లవి ప్రశాంత్ ఉండగా, నిన్న ఉదయం ఆయన అందుబాటులోకి వచ్చాడనే విషయం తెలుసుకొని ఆయన నివాసం కి వెళ్లి అరెస్ట్ చేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ రన్నర్ గా మిగిలిన అమర్ దీప్ చౌదరి కార్ పై ప్రశాంత్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో దాడి చేసారో మనమంతా చూసాము. కారు అద్దాలను పగలగొట్టి అమర్ తల్లి మరియు భార్యని భయబ్రాంతులకు గురి చేసారు. ఇందులో ప్రశాంత్ ప్రమేయం ఏమి లేదు, ఇది కేవలం నాగార్జున మరియు బిగ్ బాస్ యాజమాన్యం తప్పిదమే అని చెప్పాలి. ఈ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ సినీ సెలబ్రిటీస్ మరియు యూట్యూబర్స్ అయినప్పటికీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినప్పుడు అందరూ సమానమే.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-629.png)
కానీ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ట్యాగ్ ని ఉపయోగించి సానుభూతిని పొందాలని చూడడం, దానికి శివాజీ పదే పదే కామన్ మ్యాన్ ని టార్గెట్ చేస్తున్నారు అని రెచ్చగొట్టడం వల్ల బయట జనాల్లో అమర్ దీప్ వల్ల పల్లవి ప్రశాంత్ కి ప్రాణహాని ఉండి అనే రేంజ్ లో ప్రొజెక్ట్ అయ్యింది. దీనిని నాగార్జున హోస్ట్ గా బాధ్యత వ్యవహరిస్తూ ఖండించే ప్రయత్నం చెయ్యలేదు. శివాజీ కి ఏరోజు కూడా ఇక్కడ కామన్ మ్యాన్ మరియు సెలబ్రిటీ అనే వ్యత్యాసం లేదు, అందరూ సమానమే అని చెప్పే ప్రయత్నం ఒక్కసారి కూడా చెయ్యలేదు. టీఆర్ఫీ రేటింగ్స్ కోసం ఉన్న ఫ్లో ని ఫాలో అయిపోయాడు. దీంతో హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో పల్లవి ప్రశాంత్ ని ఎవరు తిట్టినా, అతనితో ఎవరైనా ఆవేశంగా ప్రవర్తించినా కామన్ మ్యాన్ మీద పగబట్టినట్టు జనాల్లోకి వెళ్ళింది. దాని తాలూకు రియాక్షన్ ని మొన్న మనం చూసాం అని చెప్పొచ్చు, కచ్చితంగా దీనికి నాగార్జునే బాధ్యత వహించాలి.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/12/image-630-1024x576.png)