Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒక గ్రూప్ గా కలిసి ఆడుతున్నారు అని అమర్ దీప్, ప్రియాంక మరియు శోభా శెట్టి కి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో నెగటివిటీ ఉంది. కానీ ఇప్పుడు చివరి దశకి చేరుకోవడం తో గ్రూప్ గేమ్ కాస్త స్వతంత్రం గా ఎవరికీ వారు ఆడే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి నుండి హౌస్ లో ‘టైక్ట్ టు ఫినాలే’ టాస్కులు జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ఈ టాస్కులో బిగ్ బాస్ ఆసక్తికరమైన గేమ్స్ ని ఏర్పాటు చేసాడు. ఈ గేమ్స్ లో శివాజీ మరియు శోభా శెట్టి అవుట్ అయ్యారు. మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ లో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి ఉత్కంఠ గా మారింది. మొదటి టాస్కులో అర్జున్ గెలవగా, రెండవ టాస్కు లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఆ తర్వాత మూడవ టాస్కులో అర్జున్ గెలవగా, నాల్గవ టాస్కులో పల్లవి ప్రశాంత్, ఐదవ టాస్కులో మళ్ళీ అర్జున్ గెలిచాడు.

ఇలా వీళ్లిద్దరి మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొనగా, ఆరవ టాస్కులో అమర్ దీప్ గెలిచాడు. అప్పటికే శివాజీ మరియు శోభా శెట్టి పాయింట్స్ ఇవ్వడం వల్ల అందరికంటే టాప్ లో ఉన్న అమర్ దీప్. ఈ టాస్కు గెలవడం తో ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇదంతా పక్కన పెడితే ప్రియాంక ఓడిపోయిన తర్వాత తన పాయింట్స్ లో సగం ఎవరికో ఒకరికి ఇవ్వమని బిగ్ బాస్ చెప్తాడు.

ప్రియాంక కి అమర్ దీప్ మంచి స్నేహితుడు కాబట్టి ఆమె పాయింట్స్ అమర్ దీప్ కి ఇస్తుందని హౌస్ మేట్స్ తో పాటుగా, ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ ఆమె తన పాయింట్స్ లో సగ భాగం గౌతమ్ కి ఇస్తుంది. దీంతో అమర్ దీప్ ప్రియాంక తో నాకు ఇవ్వాలని అనిపించలేదా అని అడుగుతాడు. అప్పుడు ప్రియాంక వివరిస్తూ ఉండగా, చివరికి విలన్ అయ్యింది నేనే కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పటి నుండి అమర్ దీప్ హౌస్ లో ప్రియాంక తో మాట్లాడకుండా మౌనం గా ఉంటున్నాడట.
