Bigg Boss : ఒకే చోట ఉంటున్న మనుషులు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, నువ్వు వేస్ట్, దేనికి పనికి రావు అంటూ పదే పదే అంటే ఎవరైనా మానసిక క్షోభ కి గురి అవ్వడం సహజం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అమర్ దీప్ మానసిక పరిస్థితి చూస్తే అదే అర్థం అవుతుంది. నిన్న ప్రశాంత్ తో జరిగిన గొడవలో అమర్ ని చూస్తే కచ్చితంగా ఇతనికి మానసిక స్థితి సరిగా లేదనే విషయం అర్థం అవుతుంది.

13 వారాలుగా శివాజీ మరియు అతని గ్యాంగ్ కలిసి అమర్ దీప్ ని ఒక పనికిమాలిన వాడిలాగా చూపించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అమర్ దీప్ శివాజీ మీద ఉన్న గౌరవం తో ఎన్ని మాటలు అన్నా కూడా పడ్డాడు. శివాజీ కామెడీ గా అమర్ ని అంటున్నాను అని చెప్తూనే తనకి అమర్ మీద ఉన్న కసి మొత్తం తీర్చుకుంటున్నాడు. ఇది బిగ్ బాస్ షో చూసే ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది.

అమర్ ని శివాజీ ఇంతలా తక్కువ చేసి మాట్లాడితే ఎవ్వరూ మాట్లాడరు, అదే అమర్ ప్రశాంత్ మీద చెయ్యి వేసినా కూడా పెద్ద పాపం చేసాడని, అతనికి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపేయాలని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అమర్ పై నెగటివిటీ ని వ్యాప్తి చేసేస్తారు. ఇంత నెగటివిటీ ని తట్టుకొని అమర్ దీప్ ఇంత దూరం వచ్చి, టైటిల్ విన్నింగ్ రేస్ లో నిలబడడమే పెద్ద విజయం అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ లో ప్రియాంక మరియు శోభా తప్ప కెప్టెన్ గా అమర్ కి ఎవ్వరూ విలువ ఇవ్వలేదు.

శివాజీ అయితే వీడేంది నాకు చెప్పేది, బచ్చాగాడు అన్న విధంగానే చూసాడు. ఈ తక్కువ చూపు చూడడం వల్ల ఏ చిన్న గొడవ జరిగిన అమర్ దీప్ ఓవర్ గా అగ్రెసివ్ అయిపోతున్నాడు. నిన్న పల్లవి ప్రశాంత్ తో అలా వ్యవహరించడానికి కారణం కూడా అతనిలో ఉన్న ఫ్రస్ట్రేషన్, తనని అలా మాట్లాడించేలా చేసింది. ప్రశాంత్ పట్ల అతను వ్యవహరించిన తీరు కచ్చితంగా తప్పే, కానీ దాని వెనుక ఇన్ని కారణాలు కూడా ఉన్నాయి.
