Bigg Boss Gautham : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఆసక్తికరమైన టాస్కులతో, బావోద్వేగపూరిత సంఘటనలతో, కంటెస్టెంట్స్ యొక్క కోపాలు, ద్వేషాలు మరియు అసూయల నడుమ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ వాడినని బూతులు ఏ సీజన్ లో కూడా మాట్లాడలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా శివాజీ, గౌతమ్ , అమర్ దీప్, భోలే మరియు సందీప్ వంటి కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు ఎన్నో బూతులు మాట్లాడారు. దీనికి నాగార్జున నుండి కోటింగ్ కూడా పడింది.
అదంతా పక్కన పెడితే బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ప్రాపర్టీ కి ఎలాంటి డ్యామేజ్ జరగకూడదు. కానీ ఆ రూల్ ని కంటెస్టెంట్స్ ఒక్కరు కూడా పాటించలేదు. గత వారం గౌతమ్ శివాజీ మీద కోపం తో మైక్ విసిరికొట్టడం, బిగ్ బాస్ మెయిన్ డోర్స్ బలంగా కొడుతూ తలుపులు తియ్యండి వెళ్ళిపోతాను అనడం ఎంత వైరల్ అయ్యిందో మనమంతా చూసాము.
ఇదంతా పక్కన పెడితే మీకెవ్వరికీ తెలియని ఒక షాకింగ్ నిజం ఒకటుంది. అదేమిటంటే బిగ్ బాస్ నుండి ఎవరైనా కారణం లేకుండా బయటకి సొంతంగా ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటే రెండు కోట్ల రూపాయిల జరిమానా కట్టాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మినహాయిస్తారట. అయితే మొన్న గౌతమ్ అలా బలంగా డోర్స్ ని కొడుతూ బయటకి వెళ్తా అని రచ్చ చెయ్యడం తో బిగ్ బాస్ అతన్ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట.
నీకు నువ్వు ఎలాంటి కారణం లేకుండా బయటకి వెళ్ళాలి అనుకుంటే రెండు కోట్ల రూపాయిలు ఫైన్ కట్టాలి, అగ్రిమెంట్ లో ఈ పాయింట్ కూడా ఉంది మర్చిపోయావా అని గుర్తు చేశారట. కేవలం గౌతమ్ కి మాత్రమే కాదు, శివాజీ కి కూడా గతం లో ఇలాంటి వార్ణింగ్స్ వచ్చాయట. అప్పటి నుండి ఈ ఇద్దరు అలాంటి మాటలు మాట్లాడడం తగ్గించేశారు.