Bigg Boss Shivaji : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శివాజీ, తనకి వచ్చిన ప్రతీ అవకాశాన్ని నూటికి నూరుపాళ్లు ఉపయోగించుకుంటూ హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా దాదాపుగా 96 సినిమాల్లో నటించాడు. ఈ 96 సినిమాల ద్వారా ఆయన ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నాడో తెలియదు కానీ, బిగ్ బాస్ షో ద్వారా మాత్రం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసుకున్నాడు అనే చెప్పాలి.

సినిమాల పరంగా, రాజకీయంగా రాని పేరు ప్రఖ్యాతలు శివాజీ కి బిగ్ బాస్ షో ద్వారా వచ్చింది. ఈ సీజన్ పూర్తి అయ్యాక బయటకి వచ్చిన తర్వాత ఆయనకీ టాలీవుడ్ లో అవకాశాల వెల్లువ కురుస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ కి నేను టైటిల్ గెలుచుకోవడానికి, డబ్బులు గెలుచుకోవడానికి రాలేదని, కేవలం ప్రజల మనసుల్ని గెలుచుకోవడానికి వచ్చాను అని ఆయన హౌస్ లోకి ఎంటర్ అయ్యేముందు చెప్పాడు.

చెప్పినట్టుగానే ఆయన అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు. శివాజీ డబ్బులు అవసరం లేదు అనేందుకు ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. ఆయన రాజకీయ రంగం లో యాక్టీవ్ గా ఉన్నప్పుడు ఒక ప్రముఖ మీడియా ఛానల్ అధినేత తో స్నేహం చేసాడు. ఆయనతో కలిసి ఆ టీవీ ఛానల్ లో అధిక షేర్స్ ని కొనుగోలు చేసాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ న్యూస్ ఛానల్ కి టాప్ 2 రేంజ్ లో టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటాయి. ఆ స్థాయి బ్రాండ్ ఇమేజి ఉన్న ఒక న్యూస్ ఛానల్ లో వాటాలు అంటే వందల నుండి వేల కోట్ల రూపాయిలు ఉంటుంది.

అయితే ఆ న్యూస్ ఛానల్ అధినేత ఒక స్కాం లో చిక్కుకోవడం తో సీఈఓ పదవి కి రాజీనామా వచ్చింది. అతను చేసిన తప్పు వల్ల శివాజీ కూడా చెడ్డ పేరు వచ్చింది. సంపాదించింది మొత్తం ఆయన కోల్పోవాల్సి వచ్చింది. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న శివాజీ, బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయ్యి మళ్ళీ సినిమాల్లో అవకాశాలను సంపాదించాలని చూస్తున్నాడు. ఈ ప్రయత్నం లో ఆయన గ్రాండ్ సక్సెస్ అయ్యినట్టే అని చెప్పాలి.
