Bigg Boss Contestant ప్రమాదాలు ఏ రూపం లో అయినా, ఏ క్షణం లో అయినా రావొచ్చు. కాబట్టి ప్రతీ క్షణం జాగ్రత్తగా ఉండడమే మనం చెయ్యాల్సిన ప్రధమ కర్తవ్యం. కానీ కొంతమంది సెలెబ్రిటీలు శక్తికి మించి కష్టపడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం లో డ్యాన్స్ వేస్తూ ప్రమాదానికి గురైంది. ఆమె పేరు మనిషా రాణి.

ఈమె హిందీ లో బ్లాక్ బస్టర్ గా నిల్చిన బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ లో కంటెస్టెంట్ గా వచ్చి కోట్లాది మంది ప్రజలకు చేరువ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన ఈమెకి మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. బిగ్ బాస్ రియాలిటీ షో లో ఫినాలే వరకు చేరుకొని మూడవ రన్నర్ గా నిల్చిన మనీష, ఆ తర్వాత బయటకి రాగానే పలు టీవీ చానెల్స్ లో రియాలిటీ షోస్ లో పాల్గొనే అవకాశాలు దక్కించుకుంది.

ప్రస్తుతం ఈమె సెలబ్రిటీస్ డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లాజా సీజన్ 11 లో ఒక కంటెస్టెంట్ గా చేస్తుంది. ఈ షో లో ఒక డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సమయం లో అదుపుతప్పి క్రింద పడిపోవడం తో ఒక్కసారిగా డ్యాన్స్ షో యూనిట్ మొత్తం కంగుతినింది. వెంటనే ఆమెని సమీపం లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించగా డాక్టర్లు ప్రధమ చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం ఏమి లేదని చెప్పిన డాక్టర్లు, నెల రోజుల పాటు విశ్రాంతి అవసరమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. హాస్పిటల్ బెడ్ మీద పడుకొని చికిత్స తీసుకుంటున్న మనీష రాణి ని చూసి అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మనీషా రాణి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు పలు టీవీ సీరియల్స్ లో, సినిమాల్లో నటించింది. అలా వచ్చిన ఫేమ్ తో బిగ్ బాస్ అవకాశం ని దక్కించుకున్న మనీష రాణి కోట్లాది మంది ఆడియన్స్ మనసులను గెలుచుకుంది.