Rathika : పొలంగట్ల మీద సైకిల్ ఎక్కి బీడీలు తాగుతూ అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ

- Advertisement -

Rathika : బిగ్ బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన అందరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిలో చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ సీజన్ లో హౌస్ లోకి వెళ్లిన వారిలో రతికా రోజ్ ఒకరు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన రతికా రోజ్.. బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈ చిన్నది రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తో సన్నిహితంగా ఉంటూ అందరి దృష్టి తన పై పడేలా చేసుకుంది. ప్రశాంత్ ఎక్కడుంటే అక్కడే కనిపించింది రతికా. ఒకానొక టైంలో రైతు బిడ్డకు పడిపోయింది అనిపించేంతగా నటించింది. ఆ తర్వాత రైతు బిడ్డకు రివర్స్ అయ్యింది. అతడిని విమర్శించడం మొదలు పెట్టింది. అంతే కాదు హౌస్ లో ఉన్న వారందరితో గొడవలు పెట్టుకుని బాగానే ఎంటర్ టైన్ చేసింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి.. ఆ తర్వాత ఓటింగ్ తో మళ్లీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేసింది. 12 వారంలో ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రతికాకు సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇంత వరకు ఆ సినిమా గురించిన ఎలాంటి అప్ డేట్ లేనే లేదు. అంతే కాకుండా రతికా రోజ్ కు ఓ క్రేజీ ఆఫర్ దక్కిందని కూడా ప్రచారం జరిగింది. విజయ్ దళపతి సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు రతికా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది. దాని ఊసు కూడా లేదు.

- Advertisement -

వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై షోస్ కూడా ఈ చిన్నది చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండి ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలతో యువతకు హీట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, రతికా రోజ్ తన ఇన్‌ స్టా వేదికగా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. అందులో చీర కట్టి రెండు జడలు వేసుకుని కనిపించింది. సైకిల్‌పై కూర్చుని బీడు తాగుతూ గుప్పు గుప్పుమంటూ పొగలు వదులుతోంది. పుష్ప-2 సెకండ్ సాంగ్ సూసేకి అగ్గిపుల్ల అనే సాంగ్‌కు అమ్మడు రీల్ చేసింది. ఇక ఈ వీడియోను చూసిన కొందరు సూపర్ అంటుంటే.. మరికొందరు ఆడపిల్ల వై ఉండి బీడీ తాగడమేంటి అని కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rathika Ravinder (@rathikaravinder)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here