Bigg Boss : బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న టీవీ నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి అనేక టీవీ సీరియల్స్‌లో హీరోయిన్గా నటించి క్రేజ్ సంపాదించుకున్న ఆమె బిగ్ బాస్ సీజన్ 7లో 15 వారాల పాటు కొనసాగి టాప్ ఫైవ్ కంటెస్టెంట్‌గా హౌస్ నుండి బయటకు వచ్చింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత, ఆమె తన ప్రియుడు శివకుమార్‌తో చాలా వీడియోలను షేర్ చేసింది.
పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ప్రశ్నించగా.. ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాం అని బదులిచ్చింది. ఇక పోతే ఆమె ప్రియుడు శివకుమారు వారు తమ యూట్యూబ్ ఛానెల్లో ఇటీవల ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో ప్రియాంక సర్జరీ రూమ్‌లో ఉందని తెలిపారు. తన కళ్లకు సర్జరీ చేయబోతున్నానని, గత కొన్ని రోజులుగా ఆమె సైట్‌తో ఇబ్బంది పడుతున్నానని వివరించాడు. తనకు ఏడో తరగతి నుంచే చూపు ఉందని, అయితే కాస్త ఎక్కువ కావడంతో ఇప్పుడు లెన్స్‌లు వాడుతున్నానని వివరించారు.
ఇప్పుడు చేసే సర్జరీతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వివరించారు. అయితే ప్రియాంక జీన్ సర్జరీ చేయించుకుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రియాంక అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఆమెకు సర్జరీ ఏమైంది..ఇప్పుడు ఎలా ఉంది? శివకుమార్, ప్రియాంక జైన్ మౌనరాగం సీరియల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. ఇప్పటివరకు అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు.