Bigg Boss Arjun : తండ్రి అయిన బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ అర్జున్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

- Advertisement -


Bigg Boss Arjun : బిగ్ బాస్ సీజన్ 7 ఏమేరకు హిట్ అయిందో తెలిసిందే. ఎంత హిట్ టాక్ వచ్చిందో అంత రచ్చ జరిగింది. ఇటీవల ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ ప‌డింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు అర్జున్.. చాలా మెచ్యూర్డ్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనదైన ఆట తీరుతో.. టాస్కులలో 100శాతం ఇస్తూ తన సత్తా చాటుకున్నాడు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ అనే ఒకే ఒక్క రీజన్ తో బిగ్ బాస్ సీజన్ 7 కప్ గెలుచుకోలేకపోయాడని చాలా మంది త‌మ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Bigg Boss Arjun
Bigg Boss Arjun

ఇక ఈ సీజన్స్ 7 రన్నింగ్ సమయంలో అర్జున్ భార్య సురేఖ ప్రెగ్నింట్ అన్న సంగతి షో చూసిన వాళ్లందరికీ తెలిసిందే. అర్జున్ భార్య రీసెంట్ గా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్ రూపంలో తన ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. తనకు కూతురు పుట్టినట్లు ప్రకటించడంతోపాటు.. ఆ పాపకు ఆర్కా అని నామకరణం చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో అర్జున్ – సురేఖ దంపతులకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.

ప్రస్తుతం నెట్టింట ఈ పోస్ట్ తెగ చక్కర్లు కొడుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే అర్జున్ కు డైరెక్టర్ బుచ్చిబాబు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో అవకాశాన్ని ఇచ్చినట్లు వేదిక పైనుంచే అనౌన్స్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్జున్ ఓ పక్క తన భార్యను చూసుకుంటూ.. పలు టీవీ షోల‌లో సందడి చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here