Bigg Boss Abhijeet : బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా వచ్చిన అభిజీత్.. చాలామంది బుల్లితెర ప్రేక్షకులను ప్రేమను అందుకున్నాడు. తాజాగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. ప్రస్తుతం లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌లో అభిజీత్ హీరోగా కనిపించాడు. త్వరలోనే ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్య్యూలో పాల్గొన్న అభిజీత్.. తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఒక క్లారిటీ ఇచ్చాడు.

‘‘కమ్ బ్యాక్ ఎప్పుడు అంటే చెప్పడం కష్టం. కానీ త్వరలోనే జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మంచి కథ ఉంటేనే నాకు కూడా చేయాలనిపిస్తుంది. ఏ మాత్రం డౌట్ ఉన్నా ఎక్కువశాతం వద్దులే అనే అనుకుంటాను. కథ అనేది చాలా ముఖ్యం. కచ్చితంగా మంచి స్టోరీ, ఇంట్రెస్టింగ్‌గా ఉంటే అది కచ్చితంగా చేస్తాను’’ అంటూ తన కమ్ బ్యాక్ గురించి వ్యాఖ్యలు చేశాడు అభిజీత్. ‘‘ఓసీడీ అనేది ఒక క్యారెక్టరైజేషన్. అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. దాని గురించి డిఫరెన్స్ నేను చెప్పలేను’’ అంటూ సిరీస్ చూసి దాని గురించి తెలుసుకోమని సమాధానమిచ్చాడు.

బిగ్ బాస్ 4లో తనను కంటెస్టెంట్‌గా చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు.. తనకు మిస్టర్ పర్ఫెక్ట్ అనే ట్యాగ్ ఇచ్చేశారు. దానిపై కూడా అభిజీత్ స్పందించాడు. ‘‘నన్ను పర్ఫెక్ట్ అనడం వాళ్ల ప్రేమ. నేను నిజానికి అస్సలు పర్ఫెక్ట్ కాదు. నాలో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసుకోవాలనే ప్రయత్నం ఎప్పటికైనా ఉంటుంది. నా మీద ఉన్న ప్రేమతో నన్ను పర్ఫెక్ట్ అంటున్నారు’’ అంటూ ప్రేక్షకుల ప్రేమపై స్పందించాడు.