Bigg Boss 8 తెలుగులో టాప్ రియాలిటీ షో అంటే టక్కున బిగ్ బాస్ పేరు వినిపిస్తుంది.. తెలుగులో ఇప్పటివరకు ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది.. అన్ని సీజన్స్ తో పోలిస్తే ఏడో సీజన్ జనాధారణ ఎక్కువగా పొందింది.. అంతేకాదు కాంట్రవర్శి కూడా అయ్యింది.. ఇప్పటికే బిగ్ బాస్ అభిమానులు 8వ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 త్వరలోనే, మరో 50 రోజుల్లోనే మొదలు కానుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..
గతంలో చాలా వార్తలు వినిపించాయి.. అయితే ఇప్పుడు మరోసారి వార్తలు గుప్పుమన్నాయి.. గత సీజన్స్ ఆగష్టులో స్టార్ట్ అయ్యేది.. కానీ ఈ సీజన్ మాత్రమే ఆలస్యం అయ్యిందని తెలుస్తుంది.. సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి బిగ్‌బాస్ సీజన్ 8 మొదలవుతుందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. ఈ ఏడాది సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి బిగ్‌బాస్ సీజన్ 8 మొదలవుతుందని వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసారని కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి..
అయితే ఈ సీజన్ లో కొత్త వాళ్ల కన్నా బాగా తెలిసిన వాళ్లను హౌస్ లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ యాజమాన్యం కసరత్తులు చేస్తుంది.. ఇప్పటివరకు రీతూ చౌదరి, వేణుస్వామి, నయని పావని, జబర్దస్త్ అప్పారావు, కుమారి ఆంటీ, ఓ సెలబ్రిటీ కపుల్,సీరియల్ నటి దీపికా తో పాటు పలువురు హౌస్ లోకి రానున్నారని టాక్.. అయితే ఇంతవరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.. త్వరలోనే అధికారికంగా ప్రకటించానున్నారు.. గత కొన్ని సీజన్స్ నుంచి నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్ గా ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ సారి ఎవరెవరు బిగ్‌బాస్ హౌస్ లోకి వస్తారో? ఎన్ని వివాదాలు అవుతాయో? ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..