Bigg Boss 8 : బిగ్ బాస్ 8 తెలుగులో విన్నూతన ప్రయత్నం..ఈసారి రెండు హౌస్లు!

- Advertisement -

Bigg Boss 8 స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంతటి ప్రజాధారణ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 7 సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, అతి త్వరలోనే 8 వ సీజన్ ని ప్రారంభించబోతుంది, సెప్టెంబర్ మొదటి వారం లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా ఖరారు అయ్యింది. ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. గత సీజన్ లో రొటీన్ కి బిన్నంగా, ఉల్టా పల్టా కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చిన బిగ్ బాస్ షో, ఈ సీజన్ లో కూడా అదే తరహా భిన్నమైన అంశం తో మన ముందుకు రానుంది. ఈ సీజన్ లో కేవలం ఒక్క బిగ్ బాస్ హౌస్ కాదు, ఏకంగా రెండు బిగ్ బాస్ హౌసులు ఉంటాయని టాక్ వినిపిస్తుంది.

Bigg Boss 8
Bigg Boss 8

సగం మంది కంటెస్టెంట్స్ ని ఒక హౌస్ లో, మరోసగం మంది కంటెస్టెంట్స్ ని మరో హౌస్ లో ఉంచనున్నారు. ఒక హౌస్ లో అన్నీ రకాల సౌకర్యాలు ఉంటాయి. ఆ హౌస్ లోకి అడుగుపెట్టడానికి, మరో హౌస్ లో ఉన్నవారు అద్భుతంగా టాస్కులు ఆడి అర్హతని సంపాదించాలి. ఇలా ఎంతో ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో ఈసారి మన ముందుకు రాబోతున్నారు. మొదటి ఎపిసోడ్ నుండే జనరంజకంగా ఉండేలా, మేకర్స్ పకడ్బందీ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కూడా మంచి ఫేమ్ ఉన్నోల్లనే తీసుకున్నారట.

Nagarjuna unveils Bigg Boss Telugu 6 promo, promises complete entertainment. Watch - India Today

- Advertisement -

గత సీజన్ లో లాగ కామన్ మ్యాన్ కి ఈసారి చోటు దాదాపుగా దక్కనట్టే తెలుస్తుంది. ఎందుకంటే గత సీజన్ లో కామన్ మెన్ ట్యాగ్ ని ఉపయోగించి, జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం లోపల ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ చేసారు. దీనివల్ల గత సీజన్ రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ కారుపై దాడులు కూడా జరిగిన సంఘటన తెలిసిందే. పోలీసులు ఈ విషయం పట్ల బిగ్ బాస్ యాజమాన్యం పై చాలా సీరియస్ అయ్యింది. అందుకే మళ్ళీ అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారట. త్వరలోనే ఈ సీజన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

Inside Bigg Boss OTT 2 house: Check out garden, dining area, kitchen and more | Web Series - Hindustan TimesBigg Boss

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here