Big Boss : బిగ్ బాస్ 17కి కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న స‌ల్మాన్ ఖాన్.. ఒక్కో ఎపిసోడ్ కు ఎన్ని కోట్లో తెలుసా?

- Advertisement -


Big Boss : భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వివాదాస్పద రియాల్టీ షో బిగ్ బాస్. 16సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని బిగ్ బాస్ సీజన్ 17 గ్రాండ్ ప్రీమియర్ కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షో అక్టోబర్ 15న కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. ఈ సంవత్సరం ఎలాంటి డ్రామా, వినోదాన్ని తెస్తుందో అని అభిమానులు ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నారు. అయితే షో ప్రారంభం కాకముందే, బిగ్ బాస్ 17 హోస్ట్ చేయడానికి సల్మాన్ ఖాన్ ఎంత ఫీజు తీసుకుంటున్నాడు అనే ప్రశ్న అందరిలో ఉంది.

Big Boss
Big Boss

బిగ్ బాస్ షో హోస్ట్ చేయడానికి సల్మాన్ ఖాన్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నారు. సూపర్ స్టార్ ప్రతివారం రూ.12 కోట్ల భారీ ఫీజును వసూలు చేస్తున్నాడు. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తాడు. అంటే ఒక్కో ఎపిసోడ్ కు రూ.6 కోట్లు రాబట్టనున్నాడట. ఇది మాత్రమే కాదు, షో షెడ్యూల్ చేసిన సమయం అంటే దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగితే సల్మాన్ ఖాన్ మొత్తం సీజన్‌కు రూ. 200 కోట్ల భారీ మొత్తాన్ని సంపాదించవచ్చు. అయితే, బిగ్ బాస్ 17 కోసం సల్మాన్ ఖాన్ ఫీజు గురించి అధికారిక ధృవీకరణ అయితే లేదు. భారతదేశంలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హోస్ట్ ఎవరైనా ఉంటే అది సల్మాన్ ఖాన్ మాత్రమే అనడంలో సందేహం లేదు.

Big Boss
Big Boss

ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. సినిమాల క‌న్నా సల్మాన్ బిగ్ బాస్ ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాడ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ సారి బిగ్ బాస్ 17 షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సల్మాన్ ఖాన్ తన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే ఈసారి బిగ్ బాస్ కళ్లతో పాటు తన హృదయం, మనసు, బలం కూడా కనిపిస్తాయని సల్మాన్ చెప్పాడు. సీజన్ 17 థీమ్ సింగిల్ వర్సెస్ కపుల్స్ అని సల్మాన్ చెప్పారు. ఈసారి హౌస్ ను ని మూడు భాగాలుగా విభజించనున్నారు. జంటలు హార్ట్ ప్రాంతంలో ఉంటారు. ఒంటరిగా ఉన్నవారు బ్రెయిన్ ప్రాంతంలో ఉంటారు. ప్రత్యేక అధికారాలు పొందిన వారు స్ట్రెంత్ ప్రాంతంలో ఉంటారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here