Big Boss : ఇప్పటివరకు పవర్ అస్త్రాను గెలుచుకున్న సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ సైతం తమ అస్త్రాలను తిరిగి బిగ్ బాస్‌కు పంపించేశారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఈ ముగ్గురు పవర్ అస్త్రాలను వెనక్కి ఇచ్చేయడంతో పాటు బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అదే కెప్టెన్సీ టాస్క్. బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ గురించి బిగ్ బాస్ బయటపెట్టారు.

దీంతో పవర్ అస్త్రా పోయి.. కెప్టెన్సీ టాస్క్ వచ్చింది అనుకున్నారు ప్రేక్షకులు. ఒకవైపు ఆటలో కంటెస్టెంట్స్‌గా ఉండడం వల్ల సంచాలకులుగా పూర్తిస్థాయిలో అందరినీ గమనించలేకపోయారు శోభా, యావర్. దీంతో గొడవలు మొదలయ్యాయి. ముందుగా శివాజీ, ప్రశాంత్ జంట టాస్కును పూర్తి చేసి గంటను కొట్టినా.. వారు పళ్లను సరిగా అమర్చలేదని యావర్ ఆరోపించాడు. దీంతో శివాజీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది.

ఏం మనుషులురా బాబు అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. తర్వాత ఎవరు, ఎంత వాదించినా.. తను మాత్రం జోక్యం చేసుకోలేదు. సంచాలకులుగా శోభా, యావర్ ఒక మాటపైన నిలబడలేకపోయారు. అమర్, సందీప్.. టాస్క్ పూర్తి కాకముందే గంట కొట్టడం వారి తప్పని తేల్చారు. ఇక శుభశ్రీ సైతం ఒక పన్నును తీసుకొచ్చి.. అది అవసరం లేదని తెలిసిన తర్వాత పక్కన పడేసింది. శోభా శెట్టి అయితే ఒకేసారి రెండు, మూడు పళ్లను తీసుకొని తన దగ్గర దాచిపెట్టుకొని.. దానికి స్ట్రాటజీ అని పేరు పెట్టింది. ఇలా ప్రతీ జంట.. ఏదో ఒక తప్పు చేసిందని, కానీ అందరికంటే గౌతమ్, శుభశ్రీ చేసిన తప్పు చిన్నదని భావించి సంచాలకులు వారిని విన్నర్స్‌గా ప్రకటించారు.