ఒడిశాలో పుట్టి పెరిగింది శుభశ్రీ. కుటుంబం అంతా లాయర్సే అయినా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. అందుకే తన తండ్రి కోరిక మేరకు ఎల్ఎల్‌బీ చేసిన తర్వాత మోడలింగ్‌లోకి ఎంటర్ అయ్యింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. 2020లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న తర్వాత వెంటనే తెలుగు సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకోవాలని ఇక్కడికి వచ్చేసింది.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఆమిగోస్’ చిత్రంలో చోటును సంపాదించుకుంది. ఒడిశాలో పుట్టి పెరిగింది శుభశ్రీ. కుటుంబం అంతా లాయర్సే అయినా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి రావాలనుకుంది. అందుకే తన తండ్రి కోరిక మేరకు ఎల్ఎల్‌బీ చేసిన తర్వాత మోడలింగ్‌లోకి ఎంటర్ అయ్యింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. 2020లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న తర్వాత వెంటనే తెలుగు సినీ పరిశ్రమలో స్థానం సంపాదించుకోవాలని ఇక్కడికి వచ్చేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఆమిగోస్’ చిత్రంలో చోటును సంపాదించుకుంది.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను తాగుతున్న డ్రింక్‌లో ఎవరో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చారంట కదా అని శుభశ్రీకి ప్రశ్న ఎదురయ్యింది. కానీ అలాంటిది ఏమీ జరగలేదని తను క్లారిటీ ఇచ్చింది. మామూలుగా ఇండస్ట్రీ అంటే కష్టాలు ఉంటాయని, కానీ క్యాస్టింగ్ కౌచ్‌లాంటి కష్టాలు తనకు ఎప్పుడూ ఎదురవ్వలేదని చెప్పింది. తనను ఎవరూ కమిట్మెంట్ అడగలేదని క్లారిటీ ఇచ్చింది. మామూలుగా ఈవెంట్స్‌లో దగ్గరకు వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడడం లాంటి అనుభవాలు ఎదురయ్యాయని బయటపెట్టింది. అలాంటి సమయాల్లో అలా మాట్టాడొద్దని, తనకు నచ్చదని ముక్కుసూటిగా చెప్పేస్తానని అంటోంది శుభశ్రీ. అమ్మాయిలకు ఇలాంటివి కామన్‌గా జరుగుతాయి కాబట్టి హ్యాండిల్ చేయాలి అంటూ కూల్‌గా చెప్పింది.