Double Ismart Movie క్లైమాక్స్ లో పోకిరిని మించిన ట్విస్ట్.. క్లిక్ అయితే ప్రభంజనమే!

- Advertisement -

Double Ismart Movie : పూరి జగన్నాథ్ కెరీర్ లో లాంగ్ గ్యాప్ తర్వాత తగిలిన అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ హీరో గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో కాసుల కనకవర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ చిత్రానికి మణిశర్మ అందించిన పాటలు యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూ ఊగించాయి. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే కచ్చితంగా అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఆ అంచనాలను అందుకునే విధంగానే పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ చిత్రం నుండి వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి, సెన్సార్ సభ్యులు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చారు.

Double Ismart Movie
Double Ismart Movie

ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు ఇది పూరీ జగన్నాథ్ కి భారీ కం బ్యాక్ చిత్రం అని అన్నారట. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఒక్క సన్నివేశం కూడా బోర్ కొట్టే విధంగా లేదని, పూరీ జగన్నాథ్ యూత్, మాస్ ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ గా పెట్టుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయని పొగడ్తలతో ముంచి ఎత్తారట. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అనే రేంజ్ లో ఉంటుందట. పూరి జగన్నాథ్ కెరీర్ లో మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లోనే చిరస్థాయిగా నిలిచిపోయే ట్విస్టులలో ఒకటిగా మనం పోకిరి సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ని చెప్పుకోవచ్చు.

Double iSmart Box Office: Ram Pothineni Film's Runtime Lengthy? 5 Hits That Show Length Doesn't Hinder Success!

- Advertisement -

‘డబుల్ ఇస్మార్ట్’ లో కూడా పూరీ జగన్నాథ్ ఆ స్థాయి ట్విస్టునే పెట్టాడని అంటున్నారు. ఆ ట్విస్ట్ వర్కౌట్ అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని వసూళ్లు వస్తాయని, హీరో రామ్ మరో లెవెల్ కి వెళ్తాడని అంచనా వేస్తున్నారు. రామ్ కి కూడా ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్ అవసరం. మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, తన కెపాసిటీ కి తగ్గ సినిమాలు చెయ్యడం లేదని అభిమానుల్లో ఒక అసంతృప్తి ఉంది. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ తో ఆయన అభిమానులకు కావల్సినది ఇస్తాడని విశ్లేషకులు ఆశిస్తున్నారు. మరి ఆగస్టు 15 న విడుదల కాబోతున్న ఈ సినిమా అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.

Double iSmart' first single: A catchy mass number | Telugu Cinema

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here