బుల్లితెర మీద బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పిలవబడే బిగ్ బాస్ షో ఇప్పటి వరకు ఆరు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని 7 వ సీజన్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ 7 వ సీజన్ ప్రారంభం నుండే చాలా ఆసక్తి కరంగా ఉంది. ఫ్లో చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ సీజన్ అన్నీ సీజన్స్ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలాగా ఉంది.

మునుపటి సీజన్స్ లో లాగ కాకుండా ‘ఉల్టా పల్టా’ కాన్సెప్ట్ తో ఇంటి సభ్యులతో ఆదుకోవడం ప్రేక్షకులను ఆకర్షించింది. నిన్న మొన్నటి వరకు కనీసం ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కి బెడ్స్ కూడా ఉండేవి కాదు. కానీ నిన్ననే పవర్ అస్త్ర సాధించిన సందీప్ కి ఇంటి కంటెస్టెంట్స్ అందరికీ బెడ్స్ ని అప్పజెప్పే కార్యక్రమం ఇచ్చాడు బిగ్ బాస్. అందరికీ బెడ్స్ దొరికాయి కానీ తేజా కి దొరకలేదు.

ఇదంతా పక్కన పెడితే మీరెవ్వరు గమనించని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ముందు సీజన్స్ లో లాగ కాకుండా ఈ సీజన్ లో రాత్రి సమయం లో బిగ్ బాస్ హౌస్ లో లైట్స్ ఆగడం లేదు. 24 గంటలు లోపల లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. రాత్రి పూట లైట్స్ ఆపకపోవడానికి కారణం ఏమిటంటే 24 * 7 లైవ్ చూస్తున్న ప్రేక్షకుల కోసమేనట.

డిస్నీ + హాట్ స్టార్ యాప్ లో 24 గంటలు బిగ్ బాస్ హౌస్ లైవ్ లోనే ఉంటుంది. గత సీజన్ లో అర్థ రాత్రులు చాలానే జరిగాయి. అవన్నీ లైట్స్ లేకపోవడం వల్ల సరైన జడ్జిమెంట్ రాలేదు. అందుకే ఈ సీజన్ లో అలాంటి పొరపాటు మళ్ళీ జరగకుండా లైట్స్ ని రాత్రి అందరూ నిద్ర పోయిన సమయం లో కూడా ఉంచారట బిగ్ బాస్.