Animal : తొలి సినిమాతోనే తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర క్రియేట్ చేసే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాడు. అదే సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌లో విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పుడు రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా చేశాడు. ట్రైలర్, టీజర్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేసి రాజమౌళి, మహేష్ బాబు లాంటి స్టార్లను ప్రమోషన్స్ లో భాగం చేసి మరింత బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. దీంతో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ సినిమాకు గతంలో ఎన్నడూ లేనంత క్రేజ్ తెలుగు విడుదలైన ఈ సినిమాకు దక్కింది. అర్జున్ రెడ్డి అబ్బాయి-అమ్మాయి లవ్ స్టోరీ అయితే, సందీప్ వంగా యానిమల్‌ని తండ్రీ కొడుకుల ప్రేమకథగా మార్చాడు.

యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన యానిమల్ సినిమా డిసెంబర్ 1, శుక్రవారం విడుదలైన ఈ మూవీ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతుంది. కానీ తొలి షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి పైరసీ షాక్ తగిలింది. యానిమల్ విడుదలై ఒకరోజు కాకముందే ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్.. వంటి పైరసీ వెబ్ సైట్స్ ఈ సినిమాని హెచ్ డీ క్వాలిటీతో విడుదల చేశారు. విడుదలై.. రోజు గడవక ముందే ఇలా హెచ్ డి ప్రింట్ లీక్ కావడం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కోట్లు పెట్టి ఈ చిత్ర డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. బిగ్ స్క్రీన్ పై ఆరు ఏడు వారాలు ఆడిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ కూడా అయ్యింది. అంటే సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే రోజున.. యానిమల్ మూవీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. కానీ ఇంతలోనే షాకింగ్ గా పైరసీ న్యూస్ బయటకు వచ్చింది. ఇక దీనిపై చిత్ర మేకర్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
