Tasty Teja : బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా టేస్టీ తేజా, ప్రియాంక జైన్ బాగా పాపులరైన సంగతి మన అందరికీ తెలిసిందే. టేస్టీ తేజా సోషల్ మీడియా లో ఉన్న నెటిజెన్స్ కి బాగా పరిచయం కానీ, బిగ్ బాస్ లోకి అడుగుపెట్టకముందు బుల్లితెర ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. కానీ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత తన కామెడీ టైమింగ్ తో అందరినీ అలరించి తన మార్క్ ని సెట్ చేసుకున్నాడు.

ఇప్పుడు టేస్టీ తేజా అంటే తెలియని వాళ్ళు లేరు. అలాగే ప్రియాంక జైన్ సీరియల్స్ ద్వారా మన ఆడియన్స్ బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ ద్వారా ఈమె సంపాదించిన క్రేజ్ మామూలుది కాదు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది, టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఈమె ఎక్కువగా యూట్యూబ్ ఛానల్ లోనే కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే గత కొద్దిరోజుల క్రితం టేస్టీ తేజా తాను ప్రియాంక ని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటి ప్రియాంక శివ్ అనే అతన్ని ప్రేమిస్తుంది కదా, గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి ఉంటున్నారు కదా, ఇప్పుడు సడన్ గా టేస్టీ తేజా ని పెళ్లి చేసుకోవడం ఏమిటి చండాలంగా అని మీ అందరికీ అనిపించొచ్చు. కానీ ఇది నిజం పెళ్లి కాదు, కేవలం ఒక ఫన్నీ వీడియో మాత్రమే.

ఈ వీడియో లో శివ్ కూడా ఉన్నాడు. అతనిని కాసేపు సరదాగా వీళ్లిద్దరు ఆట పట్టించారు. నేను మౌనరాగం సీరియల్ వదిలేయడం వల్లే నీకు ప్రియాంక దక్కింది, లేకపోతే ప్రియాంక నాకే అని టేస్టీ తేజా సరదాగా జోక్స్ చేసాడు. అలా వీళ్ళ ముగ్గురు మధ్య సరదాగా ఈ డిస్కషన్ జరిగింది. ఇలా వీళ్ళ ముగ్గురు కలిసి గతం లో కూడా ఒక ప్రాంక్ వీడియో చేసారు.