Priyanka Jain : ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో చాలా మంది కంటెస్టెంట్లు భారీ ప్రజాదరణ పొందారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రైతు బిడ్డ అనే ట్యాగ్ తో హౌసులోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే, నటి ప్రియాంక జైన్ కూడా ఈ సీజన్‌లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారా ఆమె మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతకు ముందు ప్రియాంక బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. దానికి మించిన పాపులారిటీ బిగ్ బాస్ షోతో ఆమెకు దక్కింది.

మౌనరాగం సీరియల్‌లో తన సహనటుడు శివకుమార్‌తో ఆమె వ్యక్తిగతంగా ప్రేమలో పడింది. ఇప్పటికీ అదే సంబంధాన్ని కొనసాగిస్తుంది. శివకుమార్‌తో ప్రేమాయణం సాగిస్తున్న ప్రియాంక.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల ఓ వీడియో ద్వారా ప్రకటించింది. తాజాగా ప్రియాంక జైన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరో షాకింగ్ విషయం చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. త్వరలో ఈ జంట అమెరికా వెళుతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రియాంక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవుతుందని అందరూ అనుకున్నారు.

కానీ మెల్లగా విషయం బయటకు వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ను పంపుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో శివకుమార్ మాత్రమే అమెరికా వెళుతున్నాడని తెలిపింది. తను వెళ్లడం లేదని స్పష్టం చేసింది. తాను వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వచ్చానని.. శివ ఇప్పుడు ఢిల్లీ వెళ్లాడని.. సెలెక్ట్ అయ్యి రెండు నెలలకు అమెరికా వెళ్తున్నానని ఆమె నిజాన్ని బయటపెట్టింది. దీంతో ప్రియాంక అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు.