Shakeela : సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి యువత అప్పట్లో ఒక రేంజ్ లో ఊర్రూతలూ ఊగించిన నటి షకీలా. మలయాళం లో అప్పట్లో ఈమె సినిమాలను బ్యాన్ చెయ్యాలి అంటూ క్యాంపైన్ జరిగింది. ఎందుకంటే ఈమె సినిమాలు విడుదలైతే అక్కడి సూపర్ స్టార్ సినిమాలను చూడడం మానేసేవారట ఆరోజుల్లో. ఆ స్థాయిలో ఈమె క్రేజ్ ని సంపాదించింది.

టాలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేసిన షకీలా, రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి రెండవ వారం లోనే బయటకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బజ్ ఇంటర్వ్యూ లో తప్ప, ఎక్కడా కనిపించని షకీలా రీసెంట్ గా తనపై దాడి చేసారంటూ తన ఇంటి సమీపం లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడం ఇప్పుడు పెద్ద సంచలనం గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే షకీలా కొంతమందిని చేరదీసి తన సొంత బిడ్డలుగా కొన్నేళ్ల నుండి పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. కుటుంబం లో వచ్చిన చిన్న మనస్పర్థల కారణం గా నేను కూతురుగా పెంచుకుంటున్న శీతల్ నిన్న ఉదయం ఇల్లు వదిలి వెళ్లిపోయిందని, ఆ తర్వాత నేను ఫోన్ చేసి ఇంటికి పిలవగా తన తల్లితో కలిసి వచ్చిందని. తాని సర్దిచెప్పి మళ్ళీ తనతో కలిసిపొయ్యే ప్రయత్నం చెయ్యగా, నాపై దాడి కి పాల్పడింది అని, షకీలా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంటే కాకుండా గొడవలో శీతల్ తల్లి అక్కడే ఉన్న లాయర్ పై అసభ్యపదజాలం ఉపయోగించి ఇష్టమొచ్చినట్టు తిట్టింది అంటూ చెప్పుకొచ్చింది షకీలా. మరోవైపు అదే రోజున అదే పోలీస్ స్టేషన్ లో శీతల్ కూడా షకీలా పై కంప్లైంట్ ఇచ్చింది. ఇద్దరు కంప్లైంట్స్ ని తీసుకున్న పోలీసులు, సీసీటీవీ కెమెరా ఆధారంగా యాక్షన్ తీసుకుంటాము అంటూ చెప్పుకొచ్చారు పోలీసులు.
