Big Boss 8 బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వనున్న మెగా ఫ్యామిలీ హీరో..ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Big Boss 8 ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఈ షో ని ఆదరిస్తూ ఉంటారు. ఇప్పటికే 7 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఇప్పుడు 8 వ సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది. 7 వ సీజన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినా అన్నీ సీజన్స్ లో ఈ సీజన్ కి అత్యధిక రేటింగ్స్ వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక అతి త్వరలో ప్రారంభం అవ్వబొయె బిగ్ బాస్ 8 , బిగ్ బాస్ 7 కంటే పెద్ద హిట్ అయ్యే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు మేకర్స్.

Bigg Boss 7 Telugu starts with a solid twist | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

అందుకే కంటెస్టెంట్స్ విషయం లో అసలు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీల పేర్లను మనమంతా చూసే ఉంటాము. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో టాక్ ఏమిటంటే, ఈ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు మెగా కుటుంబానికి సంబంధించిన ఒక హీరో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదేంటి మెగా ఫ్యామిలీ లో అందరూ పెద్ద స్టార్ హీరోలు కదా, వాళ్లకి బిగ్ బాస్ లో పాల్గొనాల్సిన అవసరం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ మెగా ఫ్యామిలీ నుండి వచ్చి కనీస స్థాయి ఫేమ్ ని కూడా దక్కించుకొని ఒక హీరో ఉన్నాడు.

- Advertisement -

Bigg Boss Telugu 8: The Much-Awaited Reality Show's Exciting New Season To Roll Out In June? Details Inside - Filmibeat

అతని పేరు పవన్ తేజ్ కొణిదెల. ఈయన చిరంజీవి కి బంధువు వరుసలోకి వస్తాడు. ఇతన్ని కూడా ఇండస్ట్రీ లోకి చిరంజీవి హీరోగా తీసుకొచ్చాడు. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’, ‘కొత్త కొత్తగా’ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు కానీ, పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత హీరో పాత్రలకు దూరమై ‘గాడ్ ఫాదర్’, ‘కోట బొమ్మాలి పీఎస్’, ‘ఉప్పెన’ , ‘ఆచార్య’ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు చేసాడు. ఇప్పుడు ఆయన కెరీర్ కి సరైన బ్రేక్ కావాలి. అది జరగాలంటే ‘బిగ్ బాస్’ షో ఒక్కటే మాధ్యమం అని పవన్ తేజ్ కొణిదెల బలంగా నమ్మి, ఈ షో లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మెగా హీరో కి బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Pavan Tej Konidela (@pavantej_konidela) • Instagram photos and videos

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here