ఈ సమ్మర్ సీజన్ లో కేవలం ‘దసరా’ మరియు ‘విరూపాక్ష’ చిత్రాలు మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ముఖ్యంగా అక్కినేని హీరోలు బాక్స్ ఆఫీస్ కి వేసిన పోట్లు మామూలివి కాదు. ‘ఏజెంట్’ మరియు ‘కస్టడీ’ చిత్రాలు కనీస స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ సినిమాల తర్వాత విడుదలైన లేటెస్ట్ చిత్రం ‘బిచ్చగాడు 2’ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది.
ప్రారంభం లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సీక్వెల్ క్రేజ్ తో ఈ చిత్రం కాసుల కనకవర్షం కురిపిస్తూ బయ్యర్స్ కాస్త ఉపశమనం కలిగించింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 6 కోట్ల రూపాయలకు జరిగింది. నాలుగు రోజులకు ఎంత వసూళ్లను సాధించిందో ఒకసారి ఈ ఆర్టికల్ లో చూద్దాము.
మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా తెలుగు రాష్ట్రాల నుండే నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ మరియు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే ట్రెండ్ ని ఎక్కువ డ్రాప్స్ లేకుండా రెండవ రోజు మరియు మూడవ రోజు వసూళ్లను రాబట్టింది. వీకెండ్ ముగిసిన తర్వాత పెద్దగా వసూళ్లు ఉండవేమో అని అందరూ అనుకున్నారు.
కానీ ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో కూడా దుమ్ము లేపేస్తుంది. సోమవారం అనగా నాల్గవ రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రానికి 6 కోట్ల 52 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే బ్రేక్ ఈవెన్ నెంబర్ ని దాటి 52 లక్షల రూపాయిలు లాభం అన్నమాట. ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.