‘బిచ్చగాడు’ సినిమాతో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైనా తమిళ హీరో విజయ్ ఆంటోనీ కి తీరని శోకం కలిగింది. ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మీరా నేడు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. గదిలో ఉరి వేసుకున్న మీరా ని గమనించిన విజయ్ వెంటనే రక్షించి ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా మార్గ మద్యం లోనే ఆమె చనిపోయింది. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ మరియు టాలీవుడ్ ని శోకసంద్రం లోకి నెట్టేసింది.

విజయ్ ఆంటోనీ కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఒకరి పేరు లారా విజయ్ ఆంటోనీ కాగా, మరొకరు మీరా విజయ్ ఆంటోనీ. తెల్లవారుజామున సోషల్ మీడియా ని ఓపెన్ చేసి చూసే నెటిజెన్స్ కి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పుడు ఎంతో కూల్ గా ఉండే విజయ్ ఆంటోనీ కి ఇలాంటి శోకం కలగడం చాలా బాధగా ఉంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ ఆంటోనీ సినిమాలు చూస్తే సామజిక స్పృహ చాలా ఉంటుంది. దానిని బట్టే చెప్పొచ్చు ఆయనకీ సమాజం మీద ఎంత ప్రేమ ఉంది అనేది. అలాంటి వ్యక్తి ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరా ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. చదువులో విపరీతమైన ఒత్తిడి ఉన్న కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అంటున్నారు తమిళ మీడియా.

విజయ్ ఆంటోనీ చాలా సార్లు తన కూతురు తీవ్రమైన ఒత్తిడి గురి అవ్వడం చూసి, ఆమెలో ఎంతో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసాడు. అయినా కూడా ఆ అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకుంది అంటే, ఆమె చదువుతున్న కళాశాల లో ఉన్న ఉపాధ్యాయులు ఎంత ఒత్తిడికి గురి చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. దీని గురించి పూర్తిగా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా లో అందరూ విజయ్ ఆంటోనీ ని ట్యాగ్ చేస్తూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు.
