Bhumika : హీరోయిన్ భూమిక పై హత్యాయత్నం చేసిన స్టార్ హీరో..అసలు ఏమి జరిగిందంటే!

- Advertisement -

Bhumika : టాలీవుడ్ లో అందం తో పాటుగా చక్కటి అభినయం కనబర్చే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు భూమిక.ఈమె సుమంత్ హీరో గా నటించిన ‘యువకుడు’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు, ఆ తర్వాత ఈమె తమిళం లో విజయ్ హీరో గా నటించిన ‘బద్రి’ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ చిత్రానికి రీమేక్. ఆ తర్వాత ఈమె తెలుగు లో పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’ చిత్రం లో నటించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

మరో విశేషం ఏమిటంటే ఈమె పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు కెరీర్ టర్నింగ్ పాయింట్స్ గా నిల్చిన చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అంటే వాళ్ళని సూపర్ స్టార్స్ గా నిలిపిన చిత్రాలలో అన్నమాట. అలాగే తమిళం లో కూడా అలా ఎన్నో సినిమాల్లో నటించింది. కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న భూమిక, కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరియు నటన కి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ వచ్చింది. ఇప్పటికీ కూడా ఆమె నటనకి ప్రాధాన్యం ఉన్న పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది. ఈ ఏడాది ఆమె సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ చిత్రం లో వెంకటేష్ కి జోడిగా నటించింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా భూమిక కి మంచి పేరు ని తెచ్చిపెట్టింది.

ఇదంతా పక్కన పెడితే భూమిక గురించి హీరో శ్రీరామ్ మాట్లాడిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఒకప్పుడు నేను భూమిక తో కలిసి ఒక సినిమా చేశాను. ఈ చిత్రం లో ఒక సాంగ్ షూటింగ్ లో భూమిక పాల్గొనాల్సి ఉంది, కానీ ఆమె నేను ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొనను అంటూ షూట్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఈ విషయం లో కోపం మామూలుగా రాలేదు. ఆ పక్క రోజు విమానాశ్రయం లో కనిపించి షూటింగ్ బాగా జరిగిందా అని అడిగింది. అప్పుడు నాకు వచ్చిన కోపానికి ఆమెని కత్తి తీసుకొని పొడిచి చంపేద్దాం అనుకున్నాను. రీసెంట్ గా మేమిద్దరం కలిసినప్పుడు ఈ విషయాన్నీ తలచుకొని నవ్వుకున్నాం. ఇప్పుడైతే నవ్వు వచ్చింది కానీ, అప్పుడు మాత్రం పిచ్చి కోపం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీ రామ్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here