Bhole Shavali : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఫిజికల్ గా మాత్రమే కాకుండా, బుర్రతో కూడా అద్భుతంగా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరూ అంటే అది శివాజీ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఈయనని నాగార్జున చాణక్య అని పిలుస్తూ ఉంటాడు. అంటే చాణక్యుడు లాగ ఎత్తులు వేస్తూ ఉంటాడని. అయితే శివాజీ ప్రభావం వల్ల హౌస్ లో గేమ్ బాగా చెడిపోతుంది అనేది ఆడియన్స్ అభిప్రాయం.
ఈ వారం నాగార్జున నుండి ఆయన మాట్లాడే బూతు మాటలకు బాగా కోటింగ్ పడింది. మళ్లీ ఆయన నిన్నటి ఎపిసోడ్ లో అలా బూతులు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పుకొచ్చాడు. అందరినీ అలా బూతులు తిట్టను బాబు గారు, నాకు బాగా క్లోజ్ అయిన వాళ్లనే తిడుతాను, 80 రోజులు అయ్యింది కదా, అందరూ బాగా క్లోజ్ అయ్యారు, అమర్ గాడికి మాత్రమే ఆ బూతులు వాడుతాను, అంత అలవాటు అయ్యాడు అని చెప్పొచ్చాడు.
ఇదంతా పక్కన పెడితే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో భోలే శవాలీ ఒక రేంజ్ లో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ని పంచిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన దురదృష్టం కొద్దీ గత వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆయన శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ తో మంచి స్నేహంగా ఉంటూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన శివాజీ గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘ శివాజీ అన్నని నాగార్జున గారు నీ శరీర బరువు తగ్గింది కానీ, తల పొగరు మాత్రం బాగా పెరిగింది అని అన్నాడు. అలా అనడం లో తప్పు లేదు, శివాజీ అన్న అప్పుడప్పుడు కొన్ని మాటలు వదిలేస్తాడు, అది ఆడియన్స్ కి తప్పుగా అర్థం అవ్వొచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు.