Big Boss : బిగ్ బాస్ హౌస్ నుండి ‘భోలే’ అవుట్..6 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Big Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్ భోలే శవాలీ. ఇతను హౌస్ లోకి కేవలం శివాజీ బ్యాచ్ కి సపోర్టు చేస్తూ, అమర్ దీప్ బ్యాచ్ పై విషం చిమ్మడమే టార్గెట్ అన్నట్టుగా ఎంటర్ అయ్యాడు. హౌస్ లోకి వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఆయన తన కోసం గేమ్ ఆడలేదు. శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ కోసమే గేమ్ ఆడేందుకు వచ్చాడు.

Big Boss
Big Boss

తనకంటూ సొంతంగా ఒక మార్కు క్రియేట్ చేసుకోవడం లో భోలే డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇష్టమైన వాళ్ళను సపోర్టు చెయ్యడానికి బిగ్ బాస్ దాకా రావడం ఎందుకు?, ఇంట్లో కూర్చొని సపోర్టు చేసుకోవచ్చు కదా, అని సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. ఇతను ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు. ఈయన ఎలిమినేషన్ అన్యాయం కాదు, అసలు ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడమే అన్యాయం అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇతన్ని హౌస్ లో ఉన్నత కాలం కంటెస్టెంట్స్ అందరూ నువ్వు బిగ్ బాస్ కి వచ్చింది ఆట ఆడదానికి అయ్యా, దయచేసి ఆడు అంటూ నామినేట్ చేసి మరీ గుర్తు చేసారు. కానీ నామినేట్ చేసిన వారిపై నిప్పులు చెరగడం, వారిని అనరాని మాటలు అనడం తప్ప భోలే తనని తానూ మార్చుకునే ప్రయత్నం చెయ్యలేదు. అందుకే జనాలు ఆయన్ని హౌస్ నుండి బయటకి పంపేశారు. కానీ ఒక్క విషయం లో మాత్రం భోలే ని మెచ్చుకోవాలి.

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లోకి అతను అడుగుపెట్టడం వల్ల అతను ఎంత గొప్ప సంగీత దర్శకుడు అనే విషయం అందరికీ తెలిసింది. క్షణాల్లో లిరిక్స్ ని అల్లేయడం, వినసొంపుగా ఉండే ట్యూన్ తో పాటలు పాడడం, భోలే లో ఉన్న అద్భుతమైన లక్షణం. ఈ షో ద్వారా ఆయన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది కాబట్టి , సినిమాల్లో అవకాశాలు మెండుగా వస్తాయని ఆశిద్దాం. ఇక పోతే ఆరు వారాలు ఆయన బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గాను 8 లక్షల రూపాయిలు పారితోషికం అందుకున్నాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here