..మెగా ఫాన్స్ ఎంతో ఎదురుచూసిన మూవీ భోళా శంకర్ చిత్రం కాస్త మెహర్ రమేష్ పుణ్యమా అని రాడ్ మూవీ గా మిగిలిపోయింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం మెహర్ రమేష్ పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఒక లెజెండరీ యాక్టర్ అయినటువంటి మెగాస్టార్ తో కూడా ఇటువంటి మూవీ తీయొచ్చు అని మెహర్ రమేష్ నిరూపించాడు.

మెగాస్టార్ డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి కామెడీ యాంగిల్ వరకు డిఫరెంట్ గా ఉంటాయి. నిజానికి చిరంజీవి సినిమా ఏ రకంగా ఉన్నా సరే అతని ఫాన్స్ మాత్రం బాస్ మూవీ బ్రహ్మాండం అని అంటారు…కానీ అలాంటిది ఈరోజు వాళ్లే…చిరంజీవి తో మూవీ ఇలా తీశారేంటి రా బాబోయ్ అని తలలు పట్టుకుంటున్నారు.

సినిమాని ఇంత చెత్తగా కూడా తీయొచ్చు అని మెహర్ రమేష్ ని చూసి అర్థం చేసుకోవచ్చు అని మెగా ఫ్యాన్స్ అతనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఛాన్స్ ఇచ్చి చిరంజీవి మెహర్ రమేష్ కి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు. దీని కరెక్ట్ గా వాడుకొని ఉంటే ఇప్పటివరకు డిజాస్టర్స్ తీస్తూ వచ్చిన మెహర్ రమేష్ చరిత్ర మారేది.
ఒకరకంగా చెప్పాలి అంటే భోళా శంకర్ మూవీలో అంతా చిరంజీవి వన్ మ్యాన్ షో గా చేశారు. కొంతమంది మెగా అభిమానులైతే అసలు ఈ మెహర్ రమేష్ కి డైరెక్షన్ వచ్చా… కనపడితే కొడతామని అంటున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు మీమ్స్ తో మెహర్ రమేష్ ని ఆడుకుంటున్నారు. తన నెగ్లిజెన్స్ కారణంగా మెహర్ రమేష్ ఒక గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు.