వరుస ఫ్లాపుల్లో ఉన్న డైరక్టర్ మెహర్ రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి ఓ అద్భుత అవకాశం కల్పించారు. వారిద్దరి కాంబోలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్. తమిళం సినిమా వేదాళంకు ఇది రీమేక్. ఇందులో చిరు సరసన తమన్నా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చిరు గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న నెటిజన్స్ దట్ ఈజ్ చిరు అంటూ మెగాస్టార్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అదేంటంటే ఈ సినిమాకి చిరంజీవి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. చిరు తన గత చిత్రాలు గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వరుస విజయం సాధించాయి. ఆ సినిమాల ఘన విజయాలతో చిరు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇదే ఊపు మీదా భోళా శంకర్ పై నమ్మకంతో చిత్రానికి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట. ఎక్కువ డబ్బులు ఇస్తామని నిర్మాతలు చెప్పినా మెగాస్టార్ వద్దన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక లాభాలు వస్తే అందులో షేర్ తీసుకుంటానన్నాడట. ఈ వార్త విన్న చిరు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
భోళా శంకర్ సినిమా థియేటర్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తుండగా ఆమె ప్రియుడి పాత్రలో హీరో సుశాంత్ నటిస్తున్నారు. అయితే తమిళ్ వేదాళం మూవీలో చెల్లెలి ప్రియుడు పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. తెలుగులో ఆ పాత్ర ప్రాముఖ్యతను డైరక్టర్ పెంచినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రవిబాబు, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.