‘వాల్తేరు వీరయ్య ‘ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు తప్ప ఈ చిత్రానికి ప్రతీ రోజు ఊహించిన దానికంటే దారులమైన వసూళ్లను నమోదు చేసుకుంటూ చిరంజీవి కెరీర్ లోనే కనీవినీ ఎరుగని డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
ఈ సినిమా విడుదలై నేటికీ వారం రోజులు పూర్తి అయ్యింది. ఈ వారం రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ముందుగా నైజాం ప్రాంతం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఆచార్య సినిమా మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది. కానీ ‘భోళా శంకర్’ చిత్రానికి మొదటి వారం లో కేవలం 6 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ఇక సీడెడ్ మెగాస్టార్ చిరంజీవి కి కంచు కోట లాంటి ప్రాంతం అంటారు, కానీ అక్కడ కూడా ఈ చిత్రానికి డిజాస్టర్ వసూళ్లే వచ్చాయి. మొదటి వారం లో ఈ చిత్రానికి ఆ ప్రాంతం లో 3 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. చిరంజీవి సై రా నరసింహా రెడ్డి చిత్రం ఈ ప్రాంతం లో మొదటి రోజు 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టింది.
అంతే భోళా శంకర్ మొదటి వారం వసూళ్లకంటే రెండింతలు ఎక్కువ, అలా ఉత్తరాంధ్ర లో 3 కోట్ల 22 లక్షల రూపాయిలు,ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు కోట్ల రూపాయిలు , వెస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల 21 లక్షల రూపాయిలు వసూళ్లను రాబట్టింది. మెగాస్టార్ కి కంచు కోట లాంటి ఈ ప్రాంతాలలో ఈ రేంజ్ డిజాస్టర్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 27 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ కర్ణాటక ,నైజాం, గుంటూరు ఇలా అన్నీ జిల్లాలలో ఈ సినిమాకి నెగటివ్ షేర్స్ వస్తున్నాయి.