Bharateeyudu 2 సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇండియన్ చిత్రం ఆరోజుల్లో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ , శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సునామి ని సృష్టించి ఆరోజుల్లోనే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ అప్పట్లో చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేదేమో. కానీ డైరెక్టర్ శంకర్ 30 ఏళ్ళ ఆలస్యం చేసాడు. ఇండియన్ అనే చిత్రం ట్రెండ్ సెట్టర్. ఆ సినిమాని అనుసరించి ఎన్నో వందల చిత్రాలు తెరకెక్కాయి.

అలాంటిది ఇండియన్ 2 అంటే కొత్త రకం తరహా స్క్రీన్ ప్లే ని ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ఇక్కడే అదే లేకుండా పోయింది. కథలో ఏమాత్రం పస లేకపోవడంతో కమర్షియల్ గా శంకర్ కి మొట్టమొదటి డిజాస్టర్ ఫ్లాప్ తగిలింది. అయినప్పటికీ క్లాసిక్ కి రీమేక్ అవ్వడం తో ఈ చిత్రానికి మొదటి రోజు మంచి వసూళ్లే వచ్చాయి. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. అలా మొదటి మూడు రోజుల్లో సుమారుగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో తెలుగు , హిందీ, తమిళం భాషలకు కలిపి 160 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అలాగే తెలుగు లో ఈ చిత్రాన్ని 21 కోట్ల రూపాయలకు సురేష్ బాబు కొనుగోలు చెయ్యగా, 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఓవరాల్ గా షేర్ లెక్కలను ఒక్కసారి పరీలిస్తే 78 కోట్ల రూపాయిలు వచ్చింది. థియేట్రికల్ బిజినెస్ 200 కోట్ల రూపాయలకు జరగగా, ఓవరాల్ గా 120 కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగించిందట. ఈ నష్టం ప్రభావం శంకర్ రామ్ చరణ్ తో తీస్తున్న ‘గేమ్ చేంజర్’ మీద పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. టీజర్, లేదా వేరే ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ ని చూసిన తర్వాతనే గేమ్ చేంజర్ చిత్రాన్ని కొనేందుకు ముందుకు వస్తామని బయ్యర్స్ నిర్మాత దిల్ రాజుతో అంటున్నారట.