Bhanu Priya: కలువ పువ్వు లాంటి ఆమె కళ్ళు.. అందమైన చిరునవ్వుతో కూడిన రూపం.. చూడడానికి అచ్చం మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ.. తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేస్తుంది.. నటనతో పాటు అద్భుతమైన నాట్యంతోను ప్రేక్షకులను సుమారు నాలుగు దశాబ్దాల పాటు అలరించింది భానుప్రియ.. టాలీవుడ్ లోనూ స్టార్ హీరోలందరి సరసన నటించింది భానుప్రియ..

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన ఆమె ఆ తరువాత సహాయ పాత్రలోనూ నటించి మెప్పించింది.. 111 సినిమాల్లో నటించారు. 1983 నుంచి 1996 వరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మగా ఎన్నలేని గుర్తింపును సంపాదించుకున్నారు.. ఉత్తమ నటిగా సపోర్టింగ్ యాక్టర్ గా మూడు నంది అవార్డులను గెలుచుకున్నారు భానుప్రియ.
1998లో భానుప్రియ అమెరికాలో స్థిరపడ్డ ఆదర్శ్ కౌశల్ అనే ఫోటోగ్రాఫర్ ను పెళ్లి చేసుకున్నారు. వారికి 2003లో పాప కూడా పుట్టింది. ఆ పాపకి అభినయ అని పేరు పెట్టుకున్నారు. వారి వ్యక్తిగత కారణాల కారణంగా 2005లో భానుప్రియ తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అయితే కౌశల్ 2018 వ సంవత్సరంలో గుండెపోటుతో చనిపోయారు . భార్య నుండి విడిపోవడంతో డిప్రెషన్ కి గురై ఆయన కన్నుమూయడంపై అనేక వార్తలు వచ్చాయి.
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన భానుప్రియ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా వారు చనిపోయిన తరువాత నుంచి నాకు జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. డాన్స్ కి సంబంధించిన హస్తముద్రలు కూడా మర్చిపోయాను. ఇటీవల ఓ తమిళ సినిమా షూటింగ్ చేస్తుంటే డైలాగ్ లు పూర్తిగా మర్చిపోయా.. మొత్తం బ్లాక్ అయిపోయింది.ఆరోగ్యం అంతగా బాగోలేదు. డాన్స్ స్కూల్ పెట్టాలని ఆలోచన కూడా విరమించుకున్నాను. ప్రస్తుతానికి మెడిసిన్ వేసుకుంటున్నాను అంటూ.. భానుప్రియ తను మతిమరుపుతో బాధపడుతున్నానని తెలిపారు. తన కూతురు అభినయ లండన్ లో చదువుకుంటుందని.. తనకి నటనపై ఆసక్తి లేదని భానుప్రియ స్పష్టం చేశారు.