Bhagawanth Kesari : కొన్ని సినిమాలకు హీరో స్థిరమైన మార్కెట్ కి తగ్గట్టుగా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ లు జరపాలి. ముందు సినిమాలు దంచికొట్టాయి కదా అనీ, కేవలం ఆ సినిమాల బిజినెస్ చూసి అదే హీరో స్థిరమైన మార్కెట్ అనుకుంటే పెద్ద పొరపాటే. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ చిత్రం లో అదే జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మామూలు గా బాలయ్య మార్కెట్ కంటే ఎక్కువ గా జరిగింది.
ఉదారహణకి 40 కోట్ల రూపాయలకు జరగాల్సిన బిజినెస్ 65 కోట్ల రూపాయిలకు జరిగిందట. ఇక్కడే సినిమా పా౫తనం మొదలైంది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించింది. ఇది ట్రేడ్ లెక్క ప్రకారం చాలా డీసెంట్ స్థాయి వసూళ్లు, కానీ బిజినెస్ ఎక్కువ జరగడం వల్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవడం పెద్ద సవాలు గా మారింది.
65 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన బాలయ్య బాబు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం మొదటి వారం 40 నుండి 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టబోతుంది. అంటే బ్రేక్ ఈవెన్ కి మరో 20 కోట్ల రూపాయిలు కావలి అన్నమాట. దసరా సెలవలు తర్వాత బిజినెస్ చాలా డల్ గా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే.
కాబట్టి క్లోసింగ్ లో మరో 5 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టే ఛాన్స్ ఉండొచ్చు. అప్పటికీ ఓవరాల్ గా 15 కోట్ల రూపాయిల నష్టం వచ్చేలా కనిపిస్తుంది. ఎటు చూసుకున్న ఈ సినిమాకి నష్టం మాత్రం తప్పడం లేదు అనే విషయం మాత్రం అర్థం అవుతుంది. హెచ్చులకు పోకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని 40 కోట్ల రూపాయిల రేంజ్ లో చేసి ఉంటే బాలయ్య కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యేది.