నటీనటులు : నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ తదితరులు
రచన – దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాతలు : సాహు గరిపాటి, హరీష్ పెద్ది
సంగీతం : థమన్
Bhagavanth Kesari : వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న బాలయ్య బాబు, అసలు అపజయమే ఎరుగని అనిల్ రావిపూడితో కలిసి ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ని చూస్తుంటే ఒక మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉన్న అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. బాలయ్య మార్కు యాక్షన్ ఉంటూనే, అనిల్ మార్క్ కామెడీ టైమింగ్ ని జోడించి ఈ సినిమా ని తీసినట్టుగా ప్రమోషనల్ కంటెంట్ ని చూస్తే అర్థం అవుతుంది. ఇంటర్వ్యూస్ లో బాలయ్య బాబు ని ఈ చిత్రం లో సబ్తుల్ క్యారక్టర్ లో చూపించినట్టుగా చెప్పాడు. నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా, అభిమానుల అంచలనాలు అందుకుండా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
నెలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ) తన కూతురు విజ్జి (శ్రీలీల) ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటాడు. విజ్జి ఒక వయస్సుకి వచ్చిన తర్వాత ఆర్మీ లో చేర్పించాలని అనుకుంటాడు. అందుకోసం విజ్జి కి ట్రైనింగ్ ఇప్పిస్తాడు. విజ్జి కి ఆర్మీ ఆఫీసర్ అవ్వడం ఇష్టం లేదు. ప్రాక్టీస్ చెయ్యలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడు లాగ తన కూతురు విజ్జి ని ఆర్మీ ఆఫీసర్ చెయ్యడానికి చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. వాస్తవానికి విజ్జి భగవంత్ కేసరి సొంత కూతురు కాదు, తన స్నేహితుడి కూతురు. అతని చివరి కోరిక తన కూతుర్ని ఆర్మీ కి పంపాలి అని. అందుకే భగవంత్ కేసరి ఎలా అయినా తన స్నేహితుడి కోరికని నెరవేర్చడానికి పూనుకుంటాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ భగవంత్ కేసరి కి మల్టీ మిలీనియర్ రాహుల్ సంగ్వి (అర్జున్ రాంపాల్) కి శత్రుత్వం ఉంటుంది. ఇతను మళ్ళీ భగవంత్ కేసరి జీవితం లోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. విజ్జి కి అతని వల్ల ఏర్పడిన సమస్యలు ఏమిటి?, భగవంత్ కేసరి చివరికి విజ్జి ని ఆర్మీ కి పంపాడా లేదా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
సినిమా ప్రారంభం 20 నిమిషాల్లోనే బాలయ్య బాబు ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రారంభం లోని జైలు ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశం అదిరిపోయింది. ఇక ఆ తర్వాత సినిమా కాస్త స్లో న్యారేషన్ లో వెళ్తుంది. కొన్ని సన్నివేశాలు అతిగా అనిపిస్తాయి. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ఎమోషనల్ గా వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో వార్నింగ్ సన్నివేశం నుండి ఇంటర్వెల్ వరకు అద్భుతంగా వచ్చింది అనే చెప్పాలి. హై వోల్టేజ్ ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రప్పిస్తాయి. అనిల్ రావిపూడి తన చిత్రాల్లో ఎక్కువగా కమెడీ కి ప్రాధాన్యం ఇస్తాడు. కానీ ఈ సినిమాలో కామెడీ కంటే కూడా ఎమోషనల్ సన్నివేశాలు బాగా కనెక్ట్ అవుతాయి. అంతే కాదు బాలయ్య ని అనిల్ రావిపూడి చాలా సెటిల్ రోల్ లో చూపించి అందరినీ షాక్ కి గురి చేసాడు.
ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే బాలయ్య స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా బాలయ్య కి నాన్ స్టాప్ ఎలివేషన్స్ తో నింపేసాడు. ముఖ్యంగా శ్రీలీల మరియు బాలయ్య మధ్య సెకండ్ హాఫ్ లో వచ్చే అన్ని ఎమోషనల్ సన్నివేశాలు వర్కౌట్ అయ్యాయి. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా సన్నివేశాలకు అదిరిపోయింది. కొన్ని సన్నివేశాలకు బాగా లౌడ్ అనిపించింది. ఇది ఆయన మ్యూజిక్ స్టైల్ అని చెప్పొచ్చు. కాజల్ అగర్వాల్ కూడా తన పరిధిమేర పర్వాలేదు అనే రేంజ్ లో నటించింది. ఇక బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ క్యారక్టర్ రొటీన్ గానే అనిపించింది. చిత్రం లో చాలా సన్నివేశాలు అనిల్ రావిపూడి మార్క్ అతి ఉండడం వల్ల కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి చిరాకు కలిగిస్తుంది కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆ సన్నివేశాలు కూడా బాగా నచ్చుతాయి.
చివరి మాట :
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచుతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు కనుల పండుగ లాగ అనిపిస్తుంది. ఈ దసరా కి ఈ చిత్రం కచ్చితంగా పైసా వసూల్ సినిమా అనే చెప్పొచ్చు.
రేటింగ్ : 2.75 /5