Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విదుడాలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని బాలయ్య కోణాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా చూపించాడు. తన స్టైల్ ని పూర్తి గా పక్కన పెట్టి, బాలయ్య స్టైల్ లో పవర్ ఫుల్ గా ఎన్నో సన్నివేశాలు రాసుకున్నాడు. ముఖ్యంగా ఈ చిత్రం లోని ఎమోషనల్ సన్నివేశాలు గడిచిన దశాబ్ద కాలం లో ఏ బాలయ్య మూవీ లో కూడా ఇంతలా ప్రేక్షకులను కట్టిపారేయలేకపోయిందని అంటున్నారు.
టాక్ ఇంత పాజిటివ్ గా వచ్చినా కూడా ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ అంతంత మాత్రం గానే ఉన్నాయి. ‘అఖండ’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చిన బాలయ్య మూవీ కి ఇలాంటి ఓపెనింగ్స్ ఎవ్వరూ ఊహించలేదు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సీడెడ్ కంటే నైజాం ప్రాంతం లో ఎక్కువ వసూళ్లు వచ్చాయట. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 3 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, సీడెడ్ ప్రాంతం లో 3 కోట్ల 20 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయట.
అలాగే కృష్ణ జిల్లాలో 88 లక్షలు, ఉత్తరాంధ్ర లో కోటి 40 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 45 లక్షలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వాచినట్టు సమాచారం. అంటే మొత్తం మీద ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 12 కోట్ల 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇక ఓవర్ సీస్ లో హాఫ్ మిలియన్ డాలర్స్ ప్రీమియర్స్ ని దక్కించుకున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టాలి. ఈ ఓపెనింగ్స్ అంత వసూళ్లు రాబట్టడానికి సరిపోవు, కాబట్టి ఇది డిజాస్టర్ వసూళ్లు అనే చెప్పాలి.