Bhagavanth Kesari : ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ కి మామూలు రేంజ్ లో కలిసి రాలేదు అని చెప్పొచ్చు . ప్రారంభం లో ‘వీర సింహా రెడ్డి’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న బాలయ్య, ఇప్పుడు రీసెంట్ గా దసరా కి ‘భగవంత్ కేసరి’ చిత్రం తో మరో హిట్ ని అందుకున్నాడు. ఓపెనింగ్స్ పరంగా కాస్త తడబడినా, ‘దసరా’ సీజన్ ని ఈ చిత్రం ఒక రేంజ్ లో ఉపయోగించుకుంది.
ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ మొత్తం కళకళలాడిపోయింది. బాలయ్య సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ రేంజ్ లో క్యూ కట్టడం ఈ చిత్రానికే జరిగింది. సినిమాలో ఉన్న కంటెంట్ అలాంటిది. అయితే దసరా తర్వాత ఈ చిత్రం వసూళ్లు క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుందా లేదా అనే సందేహం ట్రేడ్ లో మొదలైంది.
రెండవ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు అంతంత మాత్రమే. 12 వ రోజు ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 11 రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా కోటికి పైగా షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, 12 వ రోజు బాగా డ్రాప్ అయ్యింది. ఇక 13 వ రోజు అయితే 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయిందని అంటున్నారు.
12 రోజులకు కలిపి 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, 13 రోజులకు 60 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 8 కోట్ల రూపాయిలు రాబట్టాలి. సినిమాలు ఏమి లేవు కాబట్టి మరో మూడు కోట్ల రూపాయిలు అదనంగా వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ పరంగా భగవంత్ కేసరి సెమీ హిట్ అని చెప్పొచ్చు.