13 Years of Samantha : తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఎన్నో కష్టాలతో ఇండస్ట్రీకి వచ్చింది..అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇన్నేళ్లలో సమంత తన సినిమాలతో ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పర్చుకోవడమే కాదు తనకంటూ సెపరేటు ప్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నారు. సమంత తన సినీ కెరీర్ మొదలు పెట్టి నేటితో 13 యేళ్లు పూర్తైయ్యాయి. ఈ సందర్భంగా సమంత సినీ ప్రస్థానంలో మంచి హిట్ టాక్ ను అందుకోవడంతో పాటు పేరు తెచ్చుకున్న సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

సమంత మొదటి సినిమా నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏ మాయ చేశావే’ ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. ముఖ్యంగా అప్పటి యూత్ జెస్సీ మాటలకు, ఆమె అందానికి పడి పోయి..ఆ సినిమాను పదే పదే చూసిన సందర్బాలున్నాయి.. ఆ సినిమానే ఆమెను ప్రేమలో పడేలా చేసింది కూడా.. ఆ తర్వాత వరుస సినిమాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎన్టీఆర్ ‘బృందావనం’లో ఇందుగా.. గ్లామర్ పాత్రలో మెరిసింది.
ఆ తర్వాత మహేష్ బాబు ‘దూకుడు’లో మోడల్ ప్రశాంతిగా మెప్పించింది. ఈ మధ్యకాలంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా సత్తా చాటింది.. నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంతో వచ్చిన ‘ఈగ’లో ప్రేమికుడిని కొల్పోయిన యువతిగా అద్భుతంగా ఒదిగిపోయింది.ఆ సినిమా భారీ హిట్ ను అందించింది..

ఆ తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మంచి హిట్ ను అందుకుంది.. ఈ సినిమా తర్వాత అక్కినేని కుంటుంబం మొత్తం కలిసి నటించిన ‘మనం’ సినిమాలో ప్రియగా నటించింది. యాదృచ్ఛికమో కానీ ఆ తర్వాత సమంత అక్కినేని వారింటి కోడలు అయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారు.

మజిలీ, రంగస్థలం, ఓ బేబీ.. ఇక రీసెంట్ గా సమంత యశోద సినిమా మంచి హిట్ ను అందుకుంది.. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం శాకుంతలం సినిమాతో పాటు వెబ్ సిరీస్ లలో చేస్తుంది.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది..