Bellamkonda Sai Sreenivas : మీడియం రేంజ్ హీరోలలో మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బెల్లంకొండా సాయి శ్రీనివాస్, మొదటి సినిమా ‘అల్లుడు శ్రీను’ చిత్రం తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. యాక్టింగ్,డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నిట్లో తన సత్తా ని చాటి అనతి కాలం లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ సినిమా తర్వాత ఆయన అనేక చిత్రాలు చేసాడు, కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈయన హిందీ డబ్ చిత్రాలకు మాత్రం యూట్యూబ్ మరియు టీవీ టెలికాస్ట్ లో మామూలు డిమాండ్ ఉండేది కాదు. ముఖ్యంగా యూట్యూబ్ లో అయితే వందల మిల్లియన్ల వ్యూస్ వచ్చిన సినిమాలు బెల్లంకొండ కి చాలానే ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయపాటి శ్రీను తో ‘జయ జానకి నాయక’ అనే చిత్రం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని హిందీ లో డబ్ చేసి పెన్ మూవీస్ సంస్థ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. ఈ ఛానల్ లో ఈ చిత్రానికి దాదాపుగా 800 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఏ హిందీ డబ్ సినిమాకి కూడా ఈ రేంజ్ వ్యూస్ రాలేదు. పెన్ మూవీస్ సంస్థ కి ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలు అంతా ఇంతా కాదు.
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకి 150 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయట. ఈ రేంజ్ లాభాలు రావడం తో ఆ సంస్థ ఆశపడి బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి సినిమాని హిందీ రీమేక్ చేసింది. ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అలా ఒక నిర్మాత బెల్లంకొండ సినిమాలకు వస్తున్నా వ్యూస్ ని చూసి అతనితో హిందీ లో సినిమా తీసే రేంజ్ కి వెళ్లాడంటే, ఆయన హిందీ డబ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.