Bigg Boss : గ్రాండ్ ఫినాలే కి ముందే రేపు ఒక టాప్ కంటెస్టెంట్ అవుట్..ఆ కంటెస్టెంట్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్!

- Advertisement -

Bigg Boss : మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 7 ముగియబోతుంది. ఇప్పటి వరకు ప్రసారమైన సీజన్స్ అన్నీ ఒక ఎత్తు, ఈ సీజన్ మరో ఎత్తు. ఈ సీజన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది అంటే, ప్రస్తుతం ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ అందరికీ కూడా చెరో 50 లక్షలు ఇచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది అన్నమాట.

Bigg Bos
Bigg Boss

ఎన్నో ఎమోషన్స్ మరియు భావోద్వేగాల నడుమ సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మరో రెండు రోజుల్లో అయిపోనుంది అనే వార్తని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రేంజ్ లో కనెక్ట్ అయ్యింది ఈ షో. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ గా అమర్ దీప్ , పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక జైన్, అర్జున్, ప్రిన్స్ యావర్ నిలిచారు. వీరిలో టైటిల్ రేస్ కేవలం అమర్, శివాజీ మరియు ప్రశాంత్ మధ్యనే ఉంది.

ఈ ముగ్గురిలోనే ఎవరికో ఒకరికి టైటిల్ దక్కనుంది. ముగ్గురికి కూడా ఓటింగ్ మామూలు రేంజ్ లో లేదట. ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ప్రియాంక, అంబటి అర్జున్ మరియు ప్రిన్స్ యావర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని సోషల్ మీడియా లో ఒక రూమర్ ఉంది.

- Advertisement -

అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారని బిగ్ బాస్ నేరుగా చెప్పి, రేపు రాత్రి అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని బయటకి పంపబోతున్నారని ఒక టాక్ ఉంది. అయితే పంపే ముందు ముగ్గురికి 11 లక్షల రూపాయిల ఆఫర్ ఇస్తారట. ఈ 11 లక్షలు ఎవరో ఒకరు తీసుకొని గ్రాండ్ ఫినాలే నుండి తప్పుకోవాల్సిందిగా బిగ్ బాస్ చెప్తాడట. ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here