‘బెదురులంక 2012 ‘ మూవీ ఫుల్ రివ్యూ..చివరి 30 నిముషాలు వేరే లెవెల్ అంతే..!

- Advertisement -

నటీనటులు : కార్తికేయ , నేహా శెట్టి , అజయ్ ఘోష్ , ఆటో రామ్ ప్రసాద్ , శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.

రచన , దర్శకత్వం : క్లాక్స్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పనేని

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసే అతి తక్కువ మంది యంగ్ హీరోలలో ఒకడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న కార్తికేయకి ఆ తర్వాత కమర్షియల్ గా ఒక్క సక్సెస్ కూడా రాలేదు. కానీ అన్నీ సినిమాలు చూసేందుకు డిఫరెంట్ తరహాలోనే అనిపిస్తాయి. కుర్రాడిలో మంచి యాక్టింగ్ టాలెంట్ ఉంది, సరైన సినిమా పడితే వేరే లెవెల్ కి వెళ్తాడు అనే ఒపీనియన్ అందరిలోనూ ఉంది . కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా నాని గ్యాంగ్ లీడర్ మరియు అజిత్ వలిమై చిత్రాలలో విలన్ రోల్స్ కూడా చేసాడు. అలా విలక్షణ నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్న కార్తికేయ చేసిన లేటెస్ట్ చిత్రం ‘బెదురులంక 2012’. ఈ చిత్రం నేడే గ్రాండ్ గా విడుదలైంది. టీజర్ , ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, సినిమా పరంగా ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూద్దాం.

- Advertisement -
బెదురులంక 2012
బెదురులంక 2012

కథ :

బెదురూ లంక అనే గ్రామం లో ఈ కథ మొదలు అవుతుంది. ఈ గ్రామం లో 2012 వ సంవత్సరం లో యుగాంతం అని అందరూ బలంగా నమ్ముతారు. 2012 వ సంవత్సరం కోసం ఎదురు చూస్తూ భయపడుతూ ఉంటారు. ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆ ఊరి పెద్ద అజయ్ ఘోష్ ఇద్దరు దొంగ స్వాములను తయారు చేసి ఊరి మీదకి వదులుతాడు. ఆ దొంగ స్వామి లేని పోనీ భయాలను జనాల్లో పుట్టించి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు , నగలను దోచుకొని అజయ్ ఘోష్ కి వాటాలు ఇస్తుంటారు. ఇదంతా గమనించిన హీరో శివ (కార్తికేయ) ఈ ఇద్దరి దొంగస్వాముల మోసాల నుండి జనాలను కాపాడి, అజయ్ ఘోష్ కి ఎలాంటి బుడ్డి చెప్పాడు అనేదే మిగిలిన స్టోరీ.

విశ్లేషణ :

ఇద్దరు దొంగ స్వాములు ఒక గ్రామం లో అమాయకపు జనాలను మోసం చెయ్యడం, వాటిని హీరో అడ్డుకోవడం వంటి సినిమాలను మన చిన్న తనం నుండి చూస్తూనే ఉన్నాము. కానీ స్క్రీన్ ప్లే ఎంత చక్కగా తీసాడు డైరెక్టర్ అనే దానిని బట్టే చిత్రం ఫలితం ఆధారపడి ఉంటుంది. డైరెక్టర్ క్లాక్స్ ఈ విషయం లో సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. సినిమాని ఆసక్తికరంగా తీస్తూ కామెడీ ని కూడా అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా చివరి 30 నిముషాలు వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు పొట్ట చెక్కలు అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. కానీ సినిమాకి పెద్ద మైనస్ ఏదైనా ఉందా అంటే అది మొదటి 30 నిముషాలు అని చెప్పొచ్చు. ఈ మొదటి 30 నిముషాలు డైరెక్టర్ 2012 యుగాంతం అని తెలిసినప్పుడు జనాల్లో కలిగిన భయాన్ని సరిగా ప్రెజెంట్ చెయ్యలేకపోయాడని అనిపించింది.

చాలా సమయం వృధా చేస్తూ బాగా ల్యాగ్ చేసాడు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్రారంభం నుండి మంచి పేస్ లో అందుకుంటుంది మూవీ. కమెడియన్ సత్య ఎంట్రీ తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ లో వేలో సినిమా సాగుతుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో కార్తికేయ కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో ఇచ్చాడని చెప్పొచ్చు. అతని నటన మరియు డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. ఇక హీరోయిన్ నేహాసెట్టి కూడా తన పాత్ర పరిధికి మేర చాలా చక్కగా నటించింది. ఇక అజయ్ ఘోష్ నటన ఈ సినిమాకి హైలైట్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్ తో సాగే ఆయన సంభాషణలు ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వు రప్పిస్తుంది. ఇక దొంగ స్వామి గా ఆటో రాంప్రసాద్ కి మంచి క్యారక్టర్ దక్కింది. ఇక మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి వేణుముక లాగ నిల్చింది.

చివరిమాట :

థియేటర్స్ లో ఈ వీకెండ్ మంచిగా టైం పాస్ అయిపోయే సినిమా. కామెడీ ని ఇష్టపడే ప్రతీ ఒక్కరికి ఈ సినిమా తెగ నచ్చేస్తుంది.

రేటింగ్ : 2.75 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here