Bandla Ganesh : అయ్యప్ప మాల నియమాలను అతిక్రమించిన బండ్ల గణేష్..బూతులు తిడుతున్న నెటిజెన్స్!

- Advertisement -

Bandla Ganesh : కమెడియన్ గా, నిర్మాతగా బండ్ల గణేష్ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈయన ప్రసంగాలకు అసంఖ్యాకంగా అభిమానులు ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే అభిమానం కాదు, భక్తి. పవన్ కళ్యాణ్ తో ఈయన రెండు సినిమాలు చేసాడు. ఒకటి తీన్మార్ ఇంకోటి గబ్బర్ సింగ్. తీన్మార్ చిత్రం పెద్ద ఫ్లాప్ అవ్వగా, గబ్బర్ సింగ్ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చి బండ్ల గణేష్ ని టాప్ మోస్ట్ నిర్మాతలలో ఒకడిగా నిలిపింది.

Bandla Ganesh
Bandla Ganesh

ఈ సినిమా తర్వాత ఆయన ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా రాజకీయాలకు దగ్గరగా ఉన్న బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వస్తున్నాడు. ఈసారి అధికారం కాంగ్రెస్ పార్టీ సొంతం, కౌంటింగ్ అప్పుడు ఒక రోజు ముందే ఇక్కడి వచ్చి కూర్చుంటా అంటూ మరోసారి కామెడీ వ్యాఖ్యలు వదిలాడు.

ఇదంతా పక్కన పెడితే దీపావళి పండగ రోజు బండ్ల గణేష్ పెట్టే పోస్టుల కోసం మీమెర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఊరు మొత్తం కాల్చుకునే టపాకాయలన్నీ తానూ ఒక్కడే కాలుస్తాడు. దానికి తోడు టపాకాయలతో ఆయన దిగే ఫోటోలకు క్రేజ్ మాములుగా ఉండదు. సోషల్ మీడియా లో ఈ ఫోటోలపై ఎన్నో మీమ్స్ ని మనం చూసి ఉంటాము. ఈ దీపావళి కూడా ఆయన ఇలాగే టపాకాయలతో ఫోటో దిగి షేర్ చేసాడు.

- Advertisement -

ప్రస్తుతం బండ్ల గణేష్ అయ్యప్ప మాల వేసుకున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్న వారు చెప్పులను ముట్టకూడదు. కానీ ఇక్కడ బండ్ల గణేష్ చెప్పులు వేసుకొని రాత్రి సమయం లో టపాకాయలు కాలుస్తూ కనిపించాడు. దీనిని గమనించిన నెటిజెన్స్, అయ్యప్ప మాలలో ఉన్నవాడివి చెప్పులు వేసుకోకూడదు అనే ఇంకిత జ్ఞానం కూడా లేదా నీకు, మళ్ళీ పెద్ద పెద్ద నీతులు చెప్తుంటావ్ అని నెటిజెన్స్ బండ్ల గణేష్ ని కామెంట్స్ లో బూతులు తిడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here