Mokshagna Teja గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన బాలయ్య కొడుకు..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

- Advertisement -

Mokshanga Teja నందమూరి కుటుంబం నుండి ఒక్క హీరో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలచే ఆ కుటుంబం లో సక్సెస్ అయితే వారికి వచ్చే ఫాలోయింగ్ వేరు. అందుకు ఉదాహరణగా జూనియర్ ఎన్టీఆర్, బాలయ్య బాబు ని తీసుకోవచ్చు. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ తో పాటుగా ఇండస్ట్రీ మొత్తం బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. రెండేళ్ల క్రితం ఈయన లుక్స్ చూసి అసలు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యేవి. మన ఇండస్ట్రీ లో స్టార్ హీరోల వారసులందరు 20 నుండి 24 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు.

Balakrishna's Son Mokshagna To Debut With Director Anil Ravipudi's Next? - News18

కానీ మోక్షజ్ఞ మూడు పదుల వయస్సుకి దగ్గరగా ఉన్నాడు. ఇంత వయస్సు వస్తున్నా కూడా ఆయన ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం పై అభిమానుల్లో కాస్త అసంతృప్తి నెలకొంది. అయితే బాలయ్య బాబు ఎట్టి పరిస్థితిలో ఈ ఏడాది లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అని ఖరారు చెయ్యడం తో అభిమానులు కాస్త సంతృప్తి చెందారు. ఇది కాసేపు పక్కన పెడితే మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్స్ ని అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. అసలు ఇది నిజంగానే మా మోక్షజ్ఞ యేనా అని అభిమానులు గుర్తుపట్టలేని రేంజ్ లో ఆయన మేక్ ఓవర్ జరిగింది.

- Advertisement -

Image

స్టైలిష్ గా గూగుల్స్ పెట్టుకొని, ఫ్రెంచ్ గెడ్డం తో సైడ్ కి తిరిగి ఫోజులు ఇస్తూ నిన్న సోషల్ మీడియా లో ఆయన ఒక ఫోటో ని అప్లోడ్ చేసాడు. ఇది తెగ వైరల్ గా మారిపోయింది. తన మొదటి సినిమా కోసమే మోక్షజ్ఞ ఈ రేంజ్ లో అప్డేట్ అయ్యినట్టు తెలుస్తుంది. మొదటి సినిమా ఎవరితో, ఎప్పుడు మొదలు అవ్వబోతుంది, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అనే అంశాల పై అతి త్వరలోనే ఒక క్లారిటీ కూడా రానుంది అట. ఈ ఏడాది లోనే మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.

Mokshagna Teja | భగవంత్‌ కేసరి సెట్స్‌లో నందమూరి మోక్షజ్ఞ.. ఫోటోలు వైరల్‌-Namasthe Telangana

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here