Balakrishna : బాలయ్య బాబు సెకండ్ ఇన్నింగ్స్ ఏ రేంజ్ లో దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు బాలయ్యబాబు పాతకాలం డైరెక్టర్స్ తో, నాసిరకమైన సినిమాలతో వరుసగా డిజాస్టర్ ఫలితాలను అందుకుంటూ ఉండేవాడు. ఒకానొక సమయంలో బాలయ్య సినిమాలను ఆయన అభిమానులు కూడా చూడడం మానేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఎంటర్ అవ్వడంతో మొత్తం మారిపోయింది. బాలయ్య కి సంబంధించిన సినిమాల సెలెక్షన్స్ ఇప్పుడు దగ్గరుండి తేజస్విని స్వయంగా చూసుకుంటుంది. అఖండ చిత్రం భారీ విజయం తర్వాత తేజస్విని బాలయ్య కోసం వరుసగా యంగ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టింది.
అఖండ తర్వాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని తో ‘వీర సింహా రెడ్డి’, అనిల్ రావిపూడి తో ‘ భగవంత్ కేసరి’ వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాడు. ఇలా వరుసగా హిట్టు మీద హిట్ కొడతాడని బహుశా బాలయ్య అభిమానులు కూడా ఊహించి ఉండరు. అదంతా తేజస్విని కారణంగానే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. దీంతో పాటు అభిమానుల కోసం బోనస్ గా బాలయ్య కెరీర్ లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాలయ్యని నేటి తరం యూత్ ఆడియన్స్ కి మరింత దగ్గర చేసింది ఈ టాక్ షో. ఈ షో ఐడియా, రూపకర్త కూడా తేజస్వినినే అనే విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. ఈ షో కి అతిథులుగా నేటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ తప్ప అందరూ పాల్గొన్నారు. కాని బాలయ్య జనరేషన్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తో మాత్రం ఇప్పటి వరకు చెయ్యలేదు. అయితే ఈ త్వరలో ప్రారంభం అవ్వబోయే ‘అన్ స్టాపబుల్’ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ని ముఖ్య అతిథి గా పిలిచారని టాక్ వినిపిస్తుంది. చిరంజీవి కి కూడా ఆహా టీం సమాచారం అందించారని, అందుకు చిరంజీవి కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వినిపించాయి.
అయితే చివరి నిమిషం లో బాలయ్య కూతురు తేజస్విని ప్లాంస్ మార్చేసింది. మొదటి ఎపిసోడ్ చిరంజీవి తో కాకుండా వేరే సెలబ్రిటీ తో చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం మెగాస్టార్ వరకు చేరి ఆయన కాస్త హర్ట్ అయ్యినట్టు తెలుస్తుంది. కానీ చిరంజీవి , బాలయ్య కాంబినేషన్ లో ఒక టాక్ షో ఎపిసోడ్ చెయ్యాలంటే వేరే లెవెల్ లో ఉండాలని, అందుకు తగ్గ సరైన ప్లానింగ్ చేసి, సీజన్ చివరి ఎపిసోడ్ కి ఆయన్ని పిలిస్తే అదిరిపోతుందనే ఉద్దేశ్యంతో తేజస్విని అలా చేసింది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.